ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ టార్గెట్‌-2019 ల‌క్ష్యంగా ముందుకు సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను అధికారంలోకి వ‌చ్చినా రాక‌పోయినా.. అధికార పార్టీని మాత్రం చెప్పుచేత‌ల్లోకి తెచ్చుకోవాల‌నేది జ‌న‌సేనాని వ్యూ హంగా క‌నిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నా యి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత జనసేన పార్టీ నాలు గో ఆవిర్భావ దినోత్సవం నాడు తెలుగుదేశంపై పవన్‌కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీడీపీకి తాను మద్ద తు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. 


అప్పటి నుంచీ టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన అనేవిధంగా యుద్ధం సాగుతోంది. క‌ట్ చేస్తే.. మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జ‌న‌సేనానికి రెండు మార్గ‌లు ఉన్నాయ‌ని అంటున్నా రు పార్టీ నాయ‌కులు. ఒక‌టి పార్టీని మ‌రోపార్టీతో క‌లుపుకొని జ‌ట్టుగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం, రెండు.. సొంత‌గానే ఎన్నిక‌ల్లో పాల్గొని సాధ్య‌మైన‌న్ని సీట్లు సాధించి.. అధికారంలోకి వ‌చ్చే పార్టీకి మ‌ద్ద‌తిచ్చి.. జ‌న‌సేన విజ‌న్‌ను అమ‌లు అయ్యేలా చూడ‌డం.  ఈ రెండువిష‌యాల్లోనూ రెండోది బాగుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 


2014లో టీడీపీ-బీజేపీల‌కు మ‌ద్ద‌తిచ్చారు. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వేరే పార్టీకి మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా సొంతంగా బ‌లాన్ని నిరూపించుకునే శ‌క్తి ఎక్క‌డ ఉంటుంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దీంతో ప‌వ‌న్ యూట‌ర్న్ తీసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆరు నూర‌యినా.. తాను ఒంట‌రిగానే పోటీకి సిద్ద‌ప‌డాల‌ని చూస్తున్నారు. అయితే, ఆయ‌న‌ను ప‌ట్టుకుని వేలాడుతున్న క‌మ్యూనిస్టులను ఒదిలించుకోలేక‌.. పోతున్న ప‌వ‌న్‌.. వారికి ఓ ప‌ది సీట్లు ఇచ్చినా.. మిగిలిన వాటిలో ఒంట‌రిగానే పోరు చేయాల‌ని చూస్తున్నారు. మ‌రో ప్ర‌త్యామ్నాయ పార్టీగా రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్కేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు ప‌వ‌న్ వ్యూహం సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం. 


క‌నీసం 40 స్థానాల్లో గ‌ట్టిగా బ‌లం చూపించి గెలుపొందితే.. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా అవ‌త‌రించ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫ‌లితంగా ఏర్ప‌డ‌బోయే ప్ర‌భుత్వానికి అంశాల‌వారీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి.. ప్ర‌భుత్వాన్ని చెప్పు చేత‌ల్లో ఉంచుకునేందుకు వీరు అవుతుంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఇక్క‌డే మ‌రో కోణం కూడా క‌నిపిస్తోంది. ఒక వేళ అంతా బాగుండి ప్ర‌జ‌లు 100 స్థానాల్లో విజ‌యం క‌ట్ట‌బెడితే.. ఇక‌, తిరుగులేని శ‌క్తిగా అధికారంలోకే రావొచ్చ‌నేది జ‌న‌సేన నేత‌ల మాట‌. మొత్తానికి టార్గెట్-2019 దిశ‌గా జ‌న‌సేనాని వేస్తున్న అడుగులు కీల‌కం కాబొతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: