టీడీపీ పార్టీ కోసం ఒక వర్గం చేస్తున్న ప్రచారాలు , అసత్యాలు అందరికీ తెలిసిందే. అయిన దానికి కాని దానికి బాబు కు డబ్బా కొట్టడమే ఆ చానెల్స్ ప్రధాన కర్తవ్యం.  అయితే.. చంద్రబాబుకు బాకాలు ఊది, జాకీలు వేసే మీడియా మాత్రం.. అసలుకు బీజేపీ వ్యతిరేక కూటమి అనేదే చంద్రబాబు ప్రయత్నం అని ప్రచారం చేస్తుండటంతో ఇదంతా కామెడీగా మారిపోతోంది. మొన్నటి వరకూ చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి. మోడీ మళ్లీ ప్రధాని కావాలి అని అక్కడ తీర్మానం కూడా పెట్టారాయన. 

Image result for chandra babu

అప్పుడూ యూపీఏ ఉంది. ఎన్డీయేకు వ్యతిరేకంగా పద్నాలుగు యేళ్ల కిందటే యూపీఏ ఏర్పడింది. అప్పటి నుంచి కొన్ని పార్టీలు ఆ కూటమిలో చేరడం, మరి కొన్ని బయటకు రావడం జరుగుతూ ఉంది. కమ్యూనిస్టులు, డీఎంకే, ఆర్జేడీ వంటి పార్టీలు యూపీఏలోకి వస్తూ పోతూ ఉన్నాయి. ఆ కూటమిలోకి చంద్రబాబు ఇప్పుడు చేరాడు. ఎన్నిరోజులు అక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు!

Image result for chandra babu

మోడీ మళ్లీ ప్రధాని కావాలి అని బాబు తీర్మానం పెట్టినప్పుడు కూడా.. యూపీఏ ఉంది. ఆ మధ్య కరుణానిధి పుట్టిన రోజుకు అంటూ చెన్నైలో యూపీఏ వర్గాలు అన్నీ సమావేశం అయ్యాయి కూడా. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా అప్పుడు కలిశాయి కూడా.  అయితే.. కొత్త ఇప్పుడే లేచొచ్చి.. చంద్రబాబే ప్రయత్నిస్తున్నాడు, చంద్రబాబే అందరినీ కలుపుతున్నాడు, చంద్రబాబే బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తున్నాడు.. అంటూ ఆయన భజంత్రీ వర్గాలు మాత్రం రొటీన్ కామెడీ చేస్తున్నాయి. ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తే విజ్ఞులైన పాఠకులు నవ్వుకుంటారు.. వారు మరీ చెవుల్లో పూలు పెట్టుకునే బాపతు కాదు.. అనే భయభక్తులు లేనప్పుడు ఏమైనా చెప్పొచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: