టీడీపీ పార్టీ 2019 లో గెలుస్తుందో లేదో అంటే చెప్పలేము అలాంటిది టీడీపీ చెన్నైలో పోటీ చేస్తే ఓట్లు పడి గెలుస్తారా ... అయితే  అయితే ఇక్కడ తమాషా ఏంటంటే.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసినందుకు’ అని పైకి చెప్పుకుంటూ చంద్రబాబు... మోడీ వ్యతిరేక పార్టీలను అక్కున చేర్చుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో భాగంగానే ఆయన ఇవాళ స్టాలిన్ ను కూడా కలుస్తున్నారు. అదలా ఉండగా, చెన్నైలో కూడా ధర్మపోరాట దీక్ష చేయబోతున్నట్లు తెదేపా చాలాకాలం ముందునుంచి ప్రకటిస్తూనే ఉంది.

Image result for chandra babu

నిజానికి చెన్నై, బెగుళూరుల్లో కూడా అక్కడి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని పోటీకి దింపదలచుకుంటున్నట్లు కూడా.. తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆలోచించాల్సినది ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా రాకుండా అడ్డుపడుతున్న వారిలో తమిళులు కూడా ఉన్నారు. మన హోదా అవసరం సంగతి ఎలా ఉన్నా.. వారికి రాజకీయ పరిమితుల దృష్ట్యా వారు అడ్డుపడుతున్నారు. ప్రత్యేకహోదా ఏపీకి ఇస్తే, తమిళనాడు నష్టపోతుందని వారి భయం.

స్టాలిన్ తో ఆ మాట చెప్పించగలరా బాబూ!

అయితే ఇప్పుడు  చంద్రబాబు తగుదునమ్మా అని వెళ్లి డీఎంకేతో జట్టు కట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే తాను ఏం చేసినా సరే, అది రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసమే.. అంటూ తన రాజకీయ చాణక్య నీతులకు వక్రభాష్యాలు చెప్పుకునే చంద్రబాబునాయుడు.. ఇప్పుడు డీఎంకేతో ప్రత్యేకహోదాకు అనుకూలంగా ఒక్కమాటైనా చెప్పించగలడా? అనే ప్రశ్న ప్రజల్లోంచి వినిపిస్తున్నది. స్టాలిన్ తో ఆ మాట చెప్పించగలరా? అనేది డౌటు!

మరింత సమాచారం తెలుసుకోండి: