కాంగ్రెస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలో మిగిలిన నాలుగురైదుగురు నాయకులు కూడా వేరే దారి చూసుకుంటున్నారు. పొత్తుల పేరుతో నాలుగు సీట్లు గెలుచుకుని మళ్ళీ ఉనికి చాటాలనుకుంటున్న కాంగ్రెస్ కి ఇపుడు వరసగా ముగ్గురు సీనియర్ నాయకులు షాక్ ఇచ్చేసారు. ఈ బాటలోకి మరెంతమంది వస్తారో...


బాలరాజు రాజీనామా :


కాంగ్రెస్ పార్టీలో మూడున్నర దశాబ్దాలుగా బంధం పెనవేసుకున్న మాజీ మంత్రి, విశాఖ జిల్లా గిరిజన నాయకుడు పసుపులేటి బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తనని వేదనకు గురి చేస్తున్నాయంటూ బాలరాజు ఈ సందర్భంగా పేర్కొనడం విశేషం. అంటే కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం పట్ల బాలరాజు ఏకంగా కాంగ్రెస్ నే నిందించారన్నది ఇక్కడ సుస్పష్టం. ఈ తరహా అపవిత్రమైన  పొత్తు వల్లనే ఆయన పార్టీ గడప దాటి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.


జనసేనలోకి :


మాజీ మంత్రి కాంగ్రెస్ ని వీడి జనసేనలోకి వెళ్తున్నారని టాక్. ఆయన ఈ రోజు విజయవాడలో జరిగే ఓ సమావేశంలో పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేన తీర్ధం తీసుకుంటారని చెబుతున్నారు. పార్టీలో సీనియర్ గా ఉన్న బాలరాజు కాంగ్రెస్ ని వీడిపోవడంతో విశాఖ జిల్లాలో ఆ పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీకి కూడా భవిష్యత్తు లేదని చెప్పకనే చెప్పినట్లైంది.


అక్కడ నుంచి పోటీ :


వచ్చే ఎన్నికల్లో బాలరాజు పాడేరు నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఆయన‌కు ఉన్న మంచి పేరుతో పాటు, జనసేన‌కు ఉన్న అభిమాన బలం కలసివస్తే గెలుపు గ్యారంటీ అంటున్నారు.  మొత్తానికి బాలరాజు పార్టీని వీడడంతో జిల్లా రాజకీయలను  ఓ కుదుపు కుదిపినట్లైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: