ఎంతోకాలంగా ఊరిస్తున్న మంత్రి వర్గ విస్తరణ ఇపుడు జరగ‌నుంది. ఈ నెల 11న మంత్రి వర్గాన్ని విస్తరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  ఈ చివరి దఫాలో ఇద్దరికి చాన్స్ ఉంటుందని టాక్. అందులో ఒకరి మైనారిటీ కోటాలో ఉంటే, రెండవ వారు ఎస్టీ కోటాలో మంత్రి అవుతారని చెబుతున్నారు. మరి ఆ రెండో ఆఫర్ విశాఖకేనని  అంటున్నారు.  ఆ లక్కీ పర్సన్ అతనేనా అని సర్వత్రా చర్చ సాగుతోంది.


కిడారి కొడుక్కి చాన్స్ :


రెండు నెలల క్రితం మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురి అయిన  అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడు  కిడారి శ్రావణ్ కి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ బాబు మంత్రి వర్గంలో ఎస్టీలు ఎవరూ లేరు. దానికి తోడు కిడారి దారుణంగా మరణించడంతో గిరిజన వర్గం సానుభూతిని పొందేందుకు బాబు ఈ ప్లాన్ వేశారని అంటున్నారు.


ఎన్నికలు ఉండవు :


ప్రస్తుతం కిడారి శ్రావణ్ ఎమ్మెల్యే కాదు, అరకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించడానికి అవకాశం లేదు. అయినా సరే అతన్ని మంత్రి వర్గంలోకి తీసుకుని ఆరు నెలల్లోగా పదవికి రాజీనామ చేయించవచ్చునన్న ఆలోచనతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. మంత్రి హోదాలో శ్రావణ్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా జనానికి కూడా బాగా చేరువ అవుతారని అపుడు అతన్ని అరకు ఎమ్మెల్యేగా నిలబెట్టాలని కూడా బాబు వ్యూహం రచిస్తున్నారు.


గిడ్డికి షాకే :


అసలు మంత్రి పదవి కోసమే పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి ఈ పరిణామం షాక్ లాంటిదే. అరకు ఎమ్మెల్యే కిడారిని మంత్రిని చేసినా సీనియర్ అని ఆమె సర్దుకుపోవచ్చును కానీ ఏ అనుభవం లేని అతని కొడుకుని మంత్రిని చేస్తే ఈశ్వరికి అది రాజకీయంగా శరాఘాతమేనని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో మంత్రి టీడీపీ ప్రభుత్వం వచ్చినా కిడారి కుటుంబానికే అపుడు కూడా ప్రాధాన్యత ఉంటుందన్నది నిజం. మొత్తానికి చూస్తే ఫిరాయింపు వల్ల గిడ్డి నష్టపోయారా అన్న ఆందోళనలో క్యాడర్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: