రాజకీయులకు కావాల్సింది అధికారం, దానికోసం ఎన్నికల్లో గెలువాలి, దీనికోసం వారు ఎంతకైనా తెగిస్తారు, ఇప్పుడు కాంగ్రెసోళ్లు అదే పని చేయబోతున్నారు. తినడానికి తిండిలేక ఆకలి మంటలతో ఉన్నవారిని హాయిగా మాట్లాడుకోమంటోంది, చదువుకోవడనికి బేంచీలు లేవు, చెట్లకింద చదువులతో భవిష్యత్తు బుగ్గిపాలవుతోంది అంటే చేతిలో కంప్యూటర్ పెట్టి కమ్మగా ఆడుకోండి అనేందుకు సిద్దమయింది కాంగ్రెస్ పార్టీ.

ఇది విడ్డూరమే అయినా... దీనికి అప్పడే ప్రతిపాదనలు కూడా తయారు చేసి టెలికం కమీషన్ కు పంపింది కేంద్రంలోని యూపిఏ ప్రభుత్వం. అక్కడి నుంచి ఓకే అంటే కేంద్రక్యాబినెట్ ముందుకు వస్తుంది. దీనికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టుకుంటున్నారా.. అంటే అదేంలేదు, ఆకలితో అలమటిస్తున్న ప్రజల సొమ్ముతోనే ఈ షోకులు చేసేందుకు తయారయ్యారు.

బిచ్చగాడైనా సరే ఉల్లిపాయలేని ముద్దను నోట్లో పెట్టుకోలేడు, అది ఈ రోజు మద్యతరగతి వాడు తినేందుకు జంకుతున్నాడు. అలాంటిది ఆ వైపు దృష్టి లేదు కాని ఏకంగా పదివేల కోట్లు పెట్టి ప్రతి ఇంటికి సెల్ ఫోన్, 11,12 తరగతులు చదువుతున్న ప్రతి విధ్యార్థికి ఉచితంగా టాబ్లెట్ పిసి ఇవ్వాలని నిర్ణయించింది యూపిఏ ప్రభుత్వం. ఉల్లి నుంచి మొదలు కొని ఉప్పు,కారం,పసుపు, పప్పు, కూరగాయలు  కొనలేనంత ధరలతో మండిపోతుంటే, వాటిని చౌక ధరలకు అందించే పని చేస్తే ఎవరైనా సంతోషిస్తారు కాని ఇలాంటి చీప్ పనులు చేస్తే జనం చీదరించుకుని చీ కొడితే అధికారం మాట దేవుడెరుగు అడ్రస్ లేకండా గల్లంతవుతారేమో... అన్న వాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: