అందరిలోను ఇపుడదే అనుమానం మొదలైంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అమరావతికి వచ్చి చంద్రబాబునాయుడును కలవటం ఏంటి ? ఒకవైపు రాజస్ధాన్ లో ఎన్నికల్లో బిజీగా ఉండాల్సిన మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్ అమరావతికి వస్తున్నారంటే ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే వస్తారు. పైగా వస్తున్నది కూడా ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి దూతగా. ఈరోజు సాయంత్రం అమరావతిలో రెండు గంటల పాటు వీరిద్దరి మధ్య భేటీ జరుగుతుందట. ఇక్కగ గమనించాల్సిన విషయం ఏమిటంటే, గెహ్లాట్ వస్తున్న విషయం అటు తెలంగాణా ఇటు ఏపి కాంగ్రెస్ నేతలకు కూడా తెలియకపోవటం.

 

ఇంతకీ గెహ్లాట్ ఎందుకు వస్తున్నట్లు ? ఎందుకంటే, ముందస్తు ఎన్నికల్లో తెలంగాణాలో సీట్ల సర్దుబాటు జాబితాపై చంద్రబాబు ఆమోదముద్ర కోసమట. సోమవారం నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా ఇంత వరకూ అభ్యర్ధులపై ఒక నిర్ణయానికి రాకపోవటం విడ్డూరమే. మహాకూటమిలో కాంగ్రెస్ తర్వాత టిడిపినే పెద్ద పార్టీ అయినప్పటికీ సిపిఐ, టిజెఎస్ లు కూడా ఎక్కువ సీట్ల కోసం కాంగ్రెస్ ను బెదిరిస్తున్న విషయం చూస్తున్నదే. ఇఫ్పటి వరకూ మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీదే  పెద్దన్న పాత్ర అని అనుకుంటున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుదే అసలైన పాత్రగా అర్ధమవుతోంది.

 

మహాకూటమిలో ఎవరెన్ని సీట్లక పోటీ చేయాలనే విషయంలో టిడిపి 14 సీట్లలో పోటీ చేస్తోందన్న క్లారిటీ వచ్చింది. అయితే, టిడిపిలో నుండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ పెద్ద షాకే ఇచ్చింది. రేవంత్ తన వర్గానికి 9 సీట్లు అడుగుతుంటే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. రేవంత్ అంటే చంద్రబాబు మనిషే అన్న విషయంలో ఎవరికీ అనుమానం  అక్కర్లేదు. కాబట్టి రేవంత్ వర్గానికి కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయిస్తే చంద్రబాబుకు అంత బలం పెరుగుతుంది. కాబట్టి ఫైలన్ జాబితాలో మార్పులుంటే అవకాశాలున్నాయి. ఫైలన్ జాబితా ఆమోదముద్ర కోసమే చంద్రబాబును కలవటానికి గెహ్లాట్ వస్తున్నట్లు సమాచారం. చూద్దాం సాయంత్రానికి ఏ విషయం తెలుస్తుంది కదా ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: