జనసేన పార్టీకి మూలం అభిమానులు అయితే జనసేన లోకి వలసలు పెరిగేకొద్దీ అభిమానుల మధ్య గొడవలు పెరిగి పోతున్నాయి.  అభిమానులు ఇగోలు పక్కనపెట్టాలని, పార్టీ కోసం పనిచేయాలని పవన్ పదేపదే చెబుతున్నప్పటికీ ఈ కుమ్ములాటలు ఏరోజుకారోజు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ పరిణామాల్ని దగ్గరుండి గమనిస్తున్న కొంతమంది జనసేన నేతలు.. ఎన్నికల ముందు పవన్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయి, రచ్చకెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ చెబుతుండడం విశేషం.


పవన్ కు తాను గెలుస్తానని నమ్మకం కూడా లేదా ... అందుకే ఆ స్థానాలు...!

అదేకనుక జరిగితే ఇంకా క్షేత్రస్థాయి నిర్మాణ దశలోనే ఉన్న జనసేన పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే జనసేన ఆవిర్భావమే అభిమానుల పునాదులపై జరిగింది. ఇప్పుడదే అభిమానం రెండుగా చీలితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. సరిగ్గా సినిమాల విషయంలో కూడా గతంలో ఇలానే జరిగింది. మెగాభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ వేరు. ఒకప్పుడు మెగాభిమానులంటే కాంపౌండ్ హీరోలందరికీ కామన్ గా ఫ్యాన్స్.


పవన్ కు తాను గెలుస్తానని నమ్మకం కూడా లేదా ... అందుకే ఆ స్థానాలు...!

కానీ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంటే కేవలం పవన్ కు మాత్రమే ఫ్యాన్స్. కొద్దోగొప్పో రామ్ చరణ్ కు వీళ్లు అండదండలు అందిస్తారేమో కానీ బన్నీని పూర్తిగా తమ లిస్ట్ నుంచి తీసేశారు. మిగతా హీరోల సంగతి సరేసరి. సరిగ్గా ఇలాంటి చీలికే జనసేన పార్టీలో కూడా వస్తే అది చాలా నష్టం తెచ్చిపెడుతుంది. రానురాను పార్టీలో పరిస్థితి ఫ్యాన్స్ వెర్సస్ పవన్ అన్నట్టు తయారైంది. ఇప్పటికే అభిమానుల ఇష్టానికి వ్యతిరేకంగా కొంతమంది నాయకుల్ని చేర్చుకునేందుకు పవన్ పావులు కదుపుతున్నారు. రాబోయే రోజుల్లో మరింతమంది కీలకమైన నేతలు వచ్చి చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: