మన సినిమావాళ్లకి సినిమాల్లో పనిచేస్తూ జీవితాల్ని, సమాజాన్ని సినిమాలనే భావనతో బ్రతికేస్తూ - జనాలను అందులోకి లాగి భ్రమింప చేస్తున్నారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ప్రధాన వార్త అదీ పచ్చ మీడియా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేసిన "ఆపరేషన్ గరుడ" ఇంకా మూడు ఆపరేషణ్లు రాక్షస, ద్రవిడ మరియు కుమార. అయితే ఈ ఆపరెషణ్ల పేరు వింటే మనందరికీ గుర్తొచ్చే ఏకైక వ్యక్తి టాలీవుడ్ నటుడు శొంఠినేని శివాజీ. కొంతకాలంగా ఆపరేషన్ గరుడ పేరు తో ఆయన లేనిపోని సంచల నాలకు తెరతీస్తూ వచ్చిన శివాజీ "కేంద్ర ప్రభుత్వాం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి ఈ ఆపరేషన్ గరుడను ఎంచుకుందని ఆరోపణలు చేశారు. 
operation B Tammareddy కోసం చిత్ర ఫలితం
నిన్న మొన్నటి వరకు కాని, ఆతరవాత గాని అసలు "ఆపరేషన్ గరుడ నిజమైనదేనా?" అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇంకా ఇప్పుడు కూడా మొత్తం "హంబక్" అనే అభిప్రాయం వ్యక్తమౌతూనే ఉంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఆపరేషన్ గరుడ లో శివాజీ చెప్పినట్లుగా జరగడంతో ఆపరేషన్ గరుడ వాస్తవమేనని నమ్మక తప్పలేదు. అంతే కాదు శివాజి చంద్రబాబు అనుయాయుడు సామజిక వర్గానికి చెందినవాడు తెలుగుదేశం పక్షపాతి కావటంతో అసలు ఆపరేషన్ సృష్టి కర్త, కథ, కథనం, దర్శకత్వం చివరికి నిర్మాత కూడా ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని జనం ఘట్టిగా నమ్ముతున్నారు. 
సంబంధిత చిత్రం
అయితే జగన్మోహనరెడ్డి పై దాడి జరిగిన తర్వాత, పైన వివరించిన ప్రజాభిప్రాయంలో మార్పు వలన "ఆపరేషన్ గరుడ..ఎట్సెట్రా కొద్దిగా నిశ్శబ్ధం అవ్వడంతో ఇప్పుడు సరికొత్త ఆపరేషన్ మొదలవుతుందని అదే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శక నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ సంచలన ఆరోపణలు చేశారు. ఒక న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఆపరేషన్ గరుడ ఫెయిల్ అవడంతో ఇప్పుడు కొత్తగా “ఆపరేషన్ బి” పేరుతో వ్యూహాలు సిద్ధమయ్యాయి" అని గతంలో జరిగిన ఐటీ దాడులు జస్ట్ శాంపుల్ అని - అంతకంటే ఎక్కువగా కీలకమైన నేతలే లక్ష్యంగా "ఆపరేషన్-బి" సిద్ధమైందని తెలిపారు.
 operation B Tammareddy కోసం చిత్ర ఫలితం
గతంలో కంటే ఈసారి నేరుగా ఎమ్మెల్యేలు,ఎంపీలు మంత్రులపై దాడులు జరుగుతే జరుగవచ్చని తెలిపారు.  అంతేకాదు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్, బోడె ప్రసాద్, బూరుగుపల్లి శేషారావు, ప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, మురళీమోహన్, సిద్ధ రాఘవరావు, సీఎం రమేష్,  విజయవాడలోని ప్రముఖ హోటల్, టీవీ యజమాని, కేఎల్ యూనివర్సిటీ అధినేతల పై త్వరలో ఈ దాడులు జరుగుతాయని తమ్మారెడ్డి భరద్వాజ పెద్ద బాంబే పేల్చారు.


వీళ్ళలో ఎక్కువమంది టాలీవుడ్ కు చెందిన నిర్మాతలే. అత్యధికులు సామాజికంగా ఒకే వర్గానికి, అధికార టిడిపిని శాసించేవారే. ఇందులో సాధారణ ప్రజలు ఏవరూ లేదు. అందరూ సినిమా,  వణిక్, వ్యాపార, రాజకీయ ప్రముఖులే. సమాజానికి వీరు చేసిన నిస్వార్ధ సేవలూ ఏమీ లేక పోగా ఇతర సామాజిక వర్గాల అవ కాశాలన్నీ దోచేసే వారే.   
 operation B Tammareddy కోసం చిత్ర ఫలితం
అయితే ఈ విషయాలకోసం "పీఎంవో"లో ఒక అధికారి ప్రత్యేకంగా పనిచేస్తున్నారని ఈ విషయంపై మరింత సమాచారం కావాలనుకుంటే తనని విచారణ చేసుకోవచ్చని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చిన కారణం వల్లే ప్రధాని నరెంద్ర మోడీ టిడిపిని ఇబ్బంది, ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగు తున్నాయని తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చురుకైపోవటం, బిజెపి వ్యతిరేఖ శక్తులను దేశ వ్యాప్తంగా ఏకం చేయటానికి రాష్ట్రపాలనను సైతం వదిలేసి వివిధ రాష్ట్రాల రాజధానుల చుట్టు తిరిగి నాయకులతో చర్చలు జరపడం, కొంతమంది కేంద్రంలోని రాష్ట్రంలోని నాయకులకు నచ్చడం లేదని అయన వాపోయారు. ప్రజలు చంద్రబాబుని కావాలని ఎన్నుకున్నారని అలాంటిది కేంద్రప్రభుత్వం చంద్రబాబుని ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్య విరుద్దమని తమ్మారెడ్డి బీజేపీపై అగ్గి మీద గుగ్గిలమే అయ్యారట. మరి రానున్నకాలంలో మరో కొత్త సినిమా  అపరేష్-బి కి అంకురార్పణ చేశారు. ఇప్పుడు ఇది ఏ దారి తీస్తుందో నిరీక్షిద్ధాం! 
operation B Tammareddy కోసం చిత్ర ఫలితం
ఇంత కథలు చెప్పిన తమ్మరెడ్డి చంద్రబాబు కుటిల రాజకీయాలను - కేంద్రప్రభుత్వాన్ని కూల్చటానికి రాజ్య పాలన వదిలేసిన సంగతి మరచారా? నా పుట్టలో వెలు పెడితే నేను కుట్టనా! — అనే నరేంద్ర మోడీకి జరిగే నష్టం శూన్యం. కాని రాష్ట్రంలో వందల వేల కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్టులు, ఇసుక, విఫణి వ్యాపారాలతో ఇబ్బడి ముబ్బడిగా దోచేసిన సిఎం రమేష్, సుజానా చౌదరి, బీరం మస్తాన్ రావు ఇలా ఇంకెన్నో రాష్ట్ర ఆర్ధిక మూలాలను కొరికేస్తున్న కలుగు లోని ఎలుకలు, పంది కొక్కులు బయట పడితే మంచిదే కదా! అలాగే బిజెపి కేంద్రంలో ఓడిపోతే ఆ కలుగు లోని ఎలుకలు పందికొక్కులూ బయట పడతాయి కదా? ఏమంటారు తమ్మరెడ్డి భరద్వాజ గారూ!     

మరింత సమాచారం తెలుసుకోండి: