ఏకులా వచ్చి మేకులా మారిపోయాడు జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టినపుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇక నాలుగేళ్ళు టీడీపీ పక్కన ఉన్నపుడు ఎవరూ పట్టించుకోలేదు. బయటకు వచ్చి అధికార పార్టీపై తిరుగుబాటు చేసినపుడు కూడా ఇదంతా మామూలే అనుకున్నారు. కానీ, గత మూడు నెలలుగా జనసేన స్పీడ్ చూస్తూంటే రెండు ప్రధాన పార్టీలలోనూ కల్లోలం రేగుతోంది. కచ్చితంగా కొంప ముంచే పార్టీయేనని డిసైడ్ అవుతున్నారట.


జోరందుకున్న పవన్ :


జగన్ పాదయాత్ర ఓ వైపు జోరుగా సాగుతున్న టైంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. దాంతో జగన్ ఇంటికే పూర్తిగా పరిమితం అయిపోయాడు. ఈ నేపధ్యంలో ఏపీలో ఎన్నో కీలకమైన పరిణామాలు జరిగిపోయాయి. బాబు కాంగ్రెస్ ని కౌగలించుకోవడం, జాతీయ కూటమి పేరిట హడావుడి చేయడం, మరో వైపు పవన్ వరస మీటింగులతో అధికార పక్షాన్ని నిగ్గదీయడం  వంటి వాటితో ఏపీలో వైసీపీ బాగా వెనకబడిపోయిందన్న అభిప్రాయం కలిగింది. అంతే కాదు, జనసేనలో చేరికలు కూడా బాగా పెరిగాయి. పవన్ సైతం వచ్చిన వారికి వచ్చినట్లె కండువాలు కప్పుతూ పార్టీని బాగా బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నారు.


ప్రతిపక్షంగా ముందుకు  :


ఇక జనసేన ప్రతిపక్షంగా కీలకమైన పాత్రనే పోషిస్తోంది. ప్రతీ రోజూ చంద్రబాబు చేసే పనులను, టీడీపీ తప్పిదాలను ఎండగడుతూ ఏపీ రాజకీయాన్ని టీడీపీ వర్సెస్ జనసేన గా మార్చ‌డంలో పవన్ బాగా సక్సెస్ అయ్యారు. వివాదాస్పద ప్రకటనలు పవన్ చేయడం వెనక వ్యూహం అందులో భాగమే. 
మరో వైపు జగన్ పార్టీ నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం అధినేత లేని చోట సీనియర్లు అయినా బయటకు వచ్చి పార్టీ ఉనికిని చాటడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. దీంతో గత పదిహేను రోజుల ఏపీ రాజ‌కీయం చూస్తే జనసేన  బాగా ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయినట్లుగానే కనిపిస్తోంది.


వైసీపీలో మధనం :


ఈ పరిస్థితులను ఎప్పటికపుడు అధ్యయనం చేస్తున్న వైసీపీ  హై కమాండ్ పవన్ దూకుడు ప్రమాదమే అని టెన్షన్ పడుతోంది. ఇక జనంలోకి జగన్ రాకపోతే  మొత్తం పొలిటికల్ పిక్చర్ ని పవన్ హైజాక్ చేయడం ఖాయంగా కనిపిస్తోందని హైరానా పడుతోంది. అందువల్ల ఈ నెల 12 నుంచి తిరిగి జనంలోకి రావాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది. 
జగన్ మళ్లీ జనంలో ఉంటే వైసీపీ కి ఏపీ పాలిటిక్స్ లో స్పెస్ మళ్ళీ పూర్వం మాదిరిగానే వస్తుందని, రాజకీయం టీడీపీ వర్సెస్ వైసీపీగా జగన్ మార్చేయగలరని ఆ పార్టీ భావిస్తోంది. మొత్తానికి జగన్ పై హత్యాయత్నం ఎపిసోడ్ ఆ పాటీకి సానుభూతి మైలేజ్ ఏమీ తేకపోగా మధ్యలో పవన్ దూసుకుపోవడానికి మాత్రం చాన్స్ ఇచ్చిందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: