ధర్మో రక్షతి, రక్షితహ అన్నారు పెద్దలు. ఏ పనైనా మనం చక్కగా చేస్తే ప్రతిఫలం కూడా అలాగే వస్తుంది. మనం అది మానేసి నీతులు చెబితే వినే వారే వెర్రి వారు అవుతారు. ఈ దేశంలో ఎమర్జెన్సీని బాహాటంగా  పెట్టి దివంగత ప్రధాని ఇందిరాగాంధి చెడ్డ అయింది. ఆ తరువాత వచ్చిన తెలివైన రాజకీయ నాయకులు అంతకంటే గొప్పగా వ్యవస్థలను నియంత్రిస్తూ ఎక్కడికక్కడ తమకు అంతా అనుకూలం చేసుకుంటున్నారు. ఇందులో ఒకరు తక్కువా కాదు, మరొకరు ఎక్కువా లేదు.


మీడియాను నియంత్రిస్తున్నారట :


దేశంలో వ్యవస్థలు  అన్ని సర్వ నాశనం అయ్యాయి, ఇదీ ఇపుడు మన చంద్రబాబు గారి సరి కొత్త స్లోగన్, అన్ని గుప్పిట పట్టి మోడీ ప్రతిపక్ష్నం గొంతు అన్నది వినబడకుండా చేస్తున్నారుట. బాబు డిల్లీకి వెళ్ళి  మీడియా మీటింగ్ పెడితే దాన్ని కవర్ చేయనీయకుండా కేంద్రం వెనక నుంచి ఆదేశాలు ఇచ్చి అడ్డుకుందట.ఇదీ బాబు గారి ఆవేదన. కాసేపు ఇది నిజమేననుకుందాం, మరి ఏపీలో జరుగుతున్నదేమిటో.


మెజారిటీ మీడియా అంతేగా:


ఏపీలో మెజారిటీ మీడియా ఇపుడు చెస్తున్నదేమిటి. ఓ వైపు జగన్ వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూంటే కనీసం కవర్ చేసిన పాపానికి పోలేదు తెలుగు మీడియా. ఇంకోవైపు జనసెన అధినేత పవన్ కళ్యాన్ మీటింగులు పెడితే దాన్ని సైతం చూపించలేని ఏకపక్షమైపోయింది తెలుగు మీడీయా. వామపక్షాలు ఆందోళన‌ ఎపుడు మెజారిటీ మీడియా కళ్ళకు కనిపించదు.  అంతే కాదు. ప్రభుత్వంపై ఎవరు విమర్శించినా కూడా దాన్ని చూపించకుండా దాచివేసే ప్రయత్నం చేస్తూ  సర్కార్ అడుగులకు మడుగులు ఒత్తుతోంది మెజారిటీ తెలుగు మీడియా.


తిత్లీ కన్నా అదే మిన్న :


మరో దారుణం ఏంటంటే చాలా వెనకబడిన శ్రీకాకుళం జిల్లాను నెల క్రితం  తిత్లీ తుపాను వచ్చి అల్ల కల్లోలం చేస్తే దానిని సైతం చూపించకుండా ఓ టీడీపీ ప్రముఖుడిపై ఐటీ దాడులు జరిగాయని చెప్పి రోజంతా అవే ప్రసారాలు చేసిన తెలుగు మీడియా ఎవరి గుప్పిట్లో ఉందంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. నిజానికి మీడియా నియత్రణ అన్నది చంద్రబాబు నేర్పిన విద్యగానే చూడాలి. ఇపుడు పక్కన ఉన్న కేసీయార్, డిల్లీలోని మోడీ కూడా అనుసరిస్తున్నారేమో అనుకోవాలి.


ప్రజాస్వామ్యం వుందా :


అసలు ప్రజాస్వామ్యం అన్నది ఈ దేశంలో ఉందా. సామాన్యుడు తన బాధ చెప్పుకోవడానికి వ్యవస్థలు అవకాశం ఇస్తున్నాయా. ఎంతసేపు రాజకీయం, ఓట్ల వేట తప్ప మరోటి పట్టని పాలకులు వ్యవస్థలను ఏనాడో దిగజార్చారు. ఇపుడు ఒక్కరు దీనికి కారణం అని చెప్పడం కేవలం అర్ధం లేని విమర్శ మాత్రమే దీనికి అందరూ బాధ్యత వహించి చెంపలు వేస్తుకుంటే రేపటి తరానికైనా ఇదీ మన ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికైనా మిగులుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: