అదే నిజమైతే ప్రతిపక్ష నేత ప్రాణాలు గాలిలో దీపం మాదిరిగానే ఉన్నాయని అనుమానించాల్సివస్తోంది. వ్యవస్థల ఉదాశీనత, ఎక్కడ చూసినా రాజకీయమే పరమావధి అన్నట్లుగానే   తప్ప మరేం పట్టని వైనం ఇవన్నీ కనుక ఆలోచిస్తే మాత్రం ఏపీలో నిజంగా శాంతి భద్రతలు క్షీణించాయనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరుగుతున చర్చ, చేస్తున్న వాదనలు డొల్ల అని కూడా తేల్చాల్సి ఉంటుంది.


హత్యాయత్నం తొలిసారి కాదా :


వైఎస్ విజయమ్మ ప్రెస్ మీట్ పెట్టేంతవరకూ విశాఖలో జరిగిందే తొలి దాడి అని అంతా భావించారు. కానీ విజయమ్మ మీడియాతో మాట్లాడిన తరువాత చూసుకుంటే జగన్ మీద హత్యాయత్నం చేయాలనుకున్నది ఇది ఫస్ట్ అటెంప్ట్ కానే కాదట. మొదటి సారి గుంటూర్లో, ఆ తరువాత గోదావరి జిల్లాల్లో కూడా జగన్ మీద హత్యాయత్నానికి దుండగులు ఒడిగట్టారట. నిజంగా ఇది షాకింగ్ న్యూసే మరి. ఒక అతి ముఖ్యమైన‌ పార్టీకి అధ్యక్షుడు, ఏపీ శాసన సభలో ప్రతిపక్ష  నాయకుడు అయిన జగన్ ప్రాణాలకే ముప్పు ఉంటే ఇక సామాన్యులకు గతేంటి అన్నది ఇక్కడ చర్చించాల్సిన అంశమే.


బాబుకు సూటి ప్రశ్నలు :


జగన్ విషయంలో కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఏపీ సర్కార్ మీద వైఎస్ విజయమ్మ నిప్పులే చెరిగారు. ఎపుడో అలిపిరిలో దాడి జరిగితే ఇప్పటికీ కేంద్ర బలంగాలను జెడ్ ప్లస్ సెక్యూరిటీగా ఎందుకు పెట్టుకుంటున్నారని బాబును విజయమ్మ నిలదీశారు. మీకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదా అని ఆమె ప్రశ్నించారు. అలాగే అలిపిలిరిలో మీ మీద దాడి జరిగితే వైఎస్సార్ వచ్చి పరామర్శించారని, అదే మీరు జగన్ విషయంలో  ఏం చేశారంటూ విజయమ్మ బాణాలే  సంధించారు.


ప్రజలే అసలైన‌ భద్రత :


జనం నుంచి జగన్ ని ఎవరూ వేరు చేయలేరని, ప్రజలే జగన్ ప్రాణాలను కాపాడుకుంటారంటూ విజయమ్మ చెప్పిన విషయం ఏపీలో శాంతి భద్రతలను ఎండగట్టేదే. నాటి వైఎస్సార్ కానీ, నేటి జగన్ కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని, అందుకోసం ప్రాణాలను సైతం లెక్కచేయరని చెప్పిన విజయమ్మ జగన్ 12 నుంచి పాదయాత్రకు వస్తున్నారని ప్రకటించారు. 


భర్తను పోగొట్టుకుని ఇప్పటికే పుట్టెడు  బాధలో ఉన్న తమకు మరో కడుపు కోత పెట్టవద్దని విజయమ్మ మీడియా ముఖంగా వేడుకోవడం ఎవరినైనా కంట తడి పెట్టించేదే. మొత్తానికి విజయమ్మ ప్రెస్ మీట్ బాబు సర్కార్ నే కాదు. జనాన్ని కూడా కదిలించేలా సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: