జగన్ అంటే జనం, ఇది అందరికీ తెలిసిందే. జగన్ అక్కడ ఉంటే వెల్లువలా తరలివస్తారు ప్రజనీకం. జగన్ సైతం వారిని పలకరించి కరచాలనం చేయడం, వీలుంటే  సెల్ఫీలు దిగడం వంటివి చేస్తారు. ఇక జనాన్ని  ఆప్యాయంగా తలను నిమరడం వంటివి కూడా జగన్ పర్యటనలో కనిపించే కామన్ సీన్లు. మరి అవి ఇకపై కనిపిస్తాయా...


పోలీసు వలయం :


దాదాపు పదిహేడు రోజుల తరువాత జగన్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు విశాఖ విమానాశ్రయం చేరుకున్నపుడు అక్కడ చిత్రమైన సన్నివేశం ఒకటి కనిపించింది. జగన్ కోసం వేలాదిగా అభిమానులు అక్కడికి చేరుకుంటే వారి కంటే ముందుగా పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారు. వారంతా జగన్ చుట్టూ వలయంగా ఏర్పాడి అభిమానులకు జగన్ కు మధ్యన నిలిచారు. దాంతో జగన్ వద్దకు పూర్వం మాదిరిగా వెళ్ళే అవకాశం ఏ అభిమానికీ లభించలెదనే చెప్పాలి.


పాదయాత్రలో ఇదేనా :


ఈ సీన్ చూసిన అభిమానులు కలవరపడుతున్నారు. పోలీసులే జగన్ చుట్టూ ఉంటే ఇక తాము తమ అభిమాన నాయకుడిని ఎలా కలిసేది అని ఆవేదన చెందుతున్నారు. జగన్ కి తమకు మధ్యలో ఈ కొత్త అడ్డంకి ఏంటని కూడా నిలదీస్తున్నారు. ఇక పార్టీ సీనియర్ల మాట చూస్తే పాదయాత్ర కూడా ఇలాగే జరుగుతుందా అన్న సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పోలీసుకు అడ్డుగోడలు కడితే పాదయాత్ర పూర్వంలా జరగదని, జగన్, జనం మధ్యన దూరం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.


భద్రత అధికం :


జగన్ పాదయాత్ర ఇపుడు పూర్తిగా పోలీసుల కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. వారే  పూర్తి బాధ్యత తీసుకుని మొత్తం పాదయాత్రను ప‌రిశీలిస్తున్నారు. జగన్ వేసే ప్రతి అడుగు వెనకాల ఇపుడు పోలీసుల నిఘా ఉంది. ఇదంతా జగన్ పై హత్యాయత్నం జరిగిన తరువాత ఏపీ పోలీసులు తీసుకుంటున్న భద్రపరమైన ఏర్పాట్లు అని ఎంతగా చెప్పుకున్నా జగన్ పాదయాత్ర ఇలా సాగితే మాత్రం పార్టీకి ఇబ్బందేనని వైసీపీ నాయకులు అంటున్నారు. మరి జగన్ ఏ విధంగా వీటిని అధిగమించి ముందుకు సాగుతారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: