ఎక్కడైనా బావే కానీ వంగతోటలో మాత్రం కాదంటున్నారు ఏపీ కామ్రెడ్స్. చంద్రబాబు వచ్చే ఎన్న్నికల కోసం ఎన్నో ఎత్తుకు వేస్తున్నారు, కూటములు కూడా కడుతున్నారు. అందులో భాగంగా డిల్లీ వెళ్ళి జాతీయ స్థాయి వామపక్ష నాయకులను కూడా కలుపుకుంటున్నారు. మరి ఇంత చేసిన చంద్రబాబుకు ఇపుడు అనూహ్యంగా షాక్ ఎందుకిలా తగులుతోంది. వారెందుకిలా స్పందిస్తున్నారు...


బాబుతో పొత్తు లేదట:


వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తో పొత్తు పెట్టుకోమని కామ్రెడ్స్ తేల్చి చెప్పెస్తున్నారు. బాబు మార్క్ పాలిటిక్స్ ని తాము నమ్మమని, మద్దతు కూడా ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. తెలంగాణాలో మహా కూటమి కట్టామని, అక్కడ కేసీయార్ ని ఓడించడమే తమ అజెండా అని ఏపీ సీపీఐ నేత రామక్రిష్ణ చెప్పుకొస్తున్నారు. మహా కూటమిలో తమతో పాటు టీడీపీ కూడా ఓ భాగస్వామి అని ఆయన అంటున్నారు. అదే ఆంధ్రాలో అయితే అధికార టీడీపీని దించడమే తమ లక్ష్యమని నొక్కి మరీ చెబుతున్నారు. ఇక్కడ బాబుతో దోస్తీ ఏమీ ఉండదని కూడా క్లారిటీగా చెప్పెస్తున్నారు.


జనసేన తోనే :


ఏపీ వరకూ తీసుకుంటే తాము జనసేన తో కలసి కూటమి కడతామని, ఆ విధంగా ముందుకు పోతామని రామక్రిష్ణ సెలవిస్తున్నారు. అంటే ఇక్కడ బాబుకు వ్యతిరేకంగా కామ్రెడ్స్ పోటీ పెడతారన్న మాట. ఏపీలో నాలుగున్నరేళ్ళ పాలన అద్వాన్నంగా  ఉందని కూడా ఆయన సెటైర్లు వేశారు.బీజేపీతో ఇన్నాళ్ళూ అంటకాగి ఇపుడు బయటకు వస్తే తాము నమ్మమని కూడా ఆయన చెబుతున్నారు.


 విభజన హామీలు అమలు కాకపోవడానికి బీజేపీతో పాటు టీడీపీ పాత్ర కూడా ఉందని ఆయన విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో మైనారిటీలకు, గిరిజనులకు ఎన్నికల ముందు మంత్రి పదవులు ఇవ్వడాన్ని కూడా కామ్రెడ్స్ తప్పుపడుతున్నారు. ఇది ఓట్ల రాజకీయమని అంటున్నారు. 


బాబుకు భంగపాటే :


మరి ఈ విధంగా ఎర్రన్న కుండ బద్దలు కొట్టేశాక బాబుకు భంగపాటేనని అంటున్నారు. కాగ్రెస్, వామపక్షాలతో కలసి ఏపీ ఎన్నికల గోదారిని ఈదేయవచ్చునని బాబు కంటున్న కలలను ఇలా కామ్రెడ్స్ బద్దలు కొట్టేశారు. రేపటి రోజున ఏపీలో బాబుకి వ్యతిరేకంగా కూటమి కట్టే ఆలొచనలో వారున్నారు. అదే కనుక జరిగితే టీడీపీ విజయావకాశాలు మరింతగా దెబ్బ తినడం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: