తెలంగాణలో ఎన్నికల హడావుడి గత నెల నుంచి మొదలైన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బిజెపి ప్రచార పర్వంలో మునిగి తేలిపోతుంటే..మహాకూటమి (టి కాంగ్రెస్, టిటిడిపి, టిజెఎస్, సిపిఐ) లు ఇప్పటి వరకు సీట్ల సర్థుబాటు విషయంలో తర్జన భర్జన కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు  ఈసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది.  నేటి నుంచి నామినేషన్ల దరఖాస్తులు స్వికరించబోతున్నారు.  అయితే టి కాంగ్రెస్ విషయంలో సీట్ల సర్ధుబాటు ఇంకా రాలేదు.  కూటమిలో మిత్ర పపక్షాలైన టీటిడిపి 14, టీజెఎస్ 8, సీపీఐ కి 3 కేటాయించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

తాజాగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలపై దాదాపు స్పష్టత వచ్చింది. ఆ పార్టీకి కేటాయించిన 14 స్థానాల్లో పది స్థానాలు ఖరారవగా మిగతా నాలుగింటి కోసం ఆదివారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. అయితే టీడీపీ కోరుకుంటున్న సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులు కోరవడంతో వివాదం ఇంకా సర్ధుమనగడం లేదు. సత్తుపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మక్తల్, మహబూబ్‌నగర్, వరంగల్ పశ్చిమ, రాజేంద్రనగర్, ఉప్పల్ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది.

టీడీపీకి కేటాయించాల్సిన మిగతా నాలుగు  స్థానాల్లో సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఎల్‌బీనగర్ స్థానాల్లో గతంలో టీడీపీ విజయం సాధించడంతో వాటిని తమకు కేటాయించాలని టీడీపీ పట్టుబడుతోంది.  కాకపోతే..అక్కడ కాంగ్రెస్‌కు బలమైన నేతలు ఉండడంతో ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు.  అందుకు ప్రత్యామ్నాయంగా.. ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాల్సిందిగా  టికాంగ్రెస్, టిటీడీపిని కోరుతుంది.  ఇంకో స్థానాన్ని నిజామాబాద్‌లో బాల్కొండ లేదంటే బాన్సువాడ, నల్గొండ జిల్లాలో నకిరేకల్ లేదంటే ఆలేరు ఇవ్వాలని టీడీపీ కోరుతోంది.ఈ నాలుగింటి విషయంలో నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని మహాకూటమి నేతలు చెబుతున్నారు. 


సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య
అశ్వారావుపేట - మచ్చా నగేశ్వరరావు
ఖమ్మం - నామా నాగేశ్వరరావు
ఉప్పల్ - వీరేంద్ర గౌడ్
శేరిలింగం పల్లి - భవ్య ఆనంద ప్రసాద్
కూకట్ పల్లి - మందాడి - ఇ.పెద్దిరెడ్డి
వరంగ్ ఈస్ట్ - రూవూరి
మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి
మహబూబ్ నగర్ - ఎర్ర శేఖర్
నిజామాబాద్ - మండవ వెంకటేశ్వరరావు
నకెరికేల్ - పాల్వాయి రజనికుమారి


ఇంకా క్లారిటీ రాని ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఎల్బీనగర్ నియోజక వర్గాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: