పెద్ద పండుగ  సంక్రాంతి సందడి తామున్న పార్టీలోనే చేసేసుకుని ఆఖరి పిలుపు కూడా అందకపోతే అపుడు కధ నడిపించేందుకు రాజకీయ కామందులు రంగం సిధ్ధం చేసుకుంటున్నారట. అందరి టార్గెట్ ఒక్కటే. అయితే ఎమ్మెల్యే, లేకపోతే ఎంపీ, మరి ఉన్న సీట్లకు పది మంది పోటీ పడితే మిగిలిన వారి సంగతేంటి  అందుకే జనవరి నెల సిధ్ధంగా ఉంది. జంపింగు జఫాంగులు అపుడే  అమీ తుమీ తేల్చుకుంటారట.


ఆపరేషన్ ఆకర్ష్ :


ఈ మంత్రాన్ని ఇపుడు ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ జపిస్తున్నాయి. తమ వద్ద ఉన్న బలానికి తోడు ఎదుటి పార్టీ నుంచి కూడా నాయకులను తెచ్చేసుకుంటే ఇక తిరుగేలేదని అధినాయకులు భావిస్తున్నారు. అయితే ఆల్రేడీ ఒక నాయకుడు ఇటు వైపు వస్తే వారితో లోకల్ గా గొడవలున్న మరో నాయకుడు ఎదుటి పార్టీలోకే పోతాడు. ఇది పొలిటికల్ లాజిక్కు మరి. ఒకటి ఒకటి రెండు అంటూ  అధినాయకులుపెద్ద బుట్ట పట్టుకుని పిట్టలను ఏరాలనుకున్నా ఎప్పటికీ ఆ బుట్టలో రెండు పిట్టలు  కలసి ఉండలేవన్న నీతి హై కమాండ్ కీ  బాగా తెలుసు. అయినా తీరని ఆరాటంతో ఆకర్ష్ అంటున్నాయి.


ఆ రెండింటికీ గిరాకీ:


పెద్ద పండుగ పెద్ద హీరోల సినిమాల బుకింగులా ఇపుడు ఏపీలో రెండు పెద్ద పార్టీలకు యమ గిరాకీగా ఉంది. అధికార టీడీపీతో పాటు, రేపు అధికారంలోకి వస్తమనుకుంటున్న వైసీపీ వైపు అంతా చూస్తున్నారు. గెలిచే పార్టీ ఏదో తేలక అటూ ఇటూ నేతలు  కాలు గాలిన పిల్లిలా తిరుగుతూంటే మధ్యలో వచ్చిన మూడవ పార్టీ జనసేన కన్ను గీటుతోంది. దీంతో ఆ పార్టీకి కూడా నాయకులు హామీలు ఇచ్చేస్తున్నారట.


ఎన్నికల ముందు జంపింగులే :


ఇక జనవరి పండుగ తరువాత జంపింగులు చేస్తే అధికారం పోతుందన్న కంగారూ లేదు. టికెట్లకు అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్  అవుతుందన్న బెంగా లేదని ఏపీలోని జంపింగ్ జఫాంగులు డిసైడ్ అయ్యారట. అందువల్లనే ఏ పార్టీ ఇపుడు పిలుస్తున్నా రెండు నెలలు ఆగండి అంటూ గడువు పెడుతున్నారట. ఇక జనసేన విషయంలో కూడా మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారట. ముందు ఆ పార్టీలు నో అనెయనీయండి. అపుడు మీ దగ్గరకే వస్తామని.


 సో పెద్ద పండుగ తరువాత ఏపీ పోలిటిక్స్ లో  రంజైన రాజకీయం మొదలవుతుందన్న మాట. ఏకంగా ఎమ్మెల్యేలే కాదు. మంత్రులు కూడా లాంగ్ జంపులు చేస్తారట. సిట్టింగులు కూడా బోర్డులు తిప్పేసి తమకు నచ్చిన పార్టీలో చేరిపోతారట. ఆ టైంలో జనసేన కూడా జనం తో కిటికిటలాడుతుందని అంటున్నారు. మొత్తానికి పెద్ద పండుగ తరువాత అసలైన పండుగ ఏపీలో మొదలైపోతుందన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: