తెలంగాణ లో ఎన్నికల హడావుడి మొదలైంది.  ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ఇతర కొన్ని పార్టీలు ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నాయి.  అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఎలాగైన చెక్ పెట్టి ఓడించాలనే లక్ష్యంతో టి కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడబోతున్న విషయం తెలిసిందే.  ఈ కూటమిలో టిటిడిపి, టిజెఎస్, సిపిఐ లు ఉండబోతున్నాయి.  ఇదిలా ఉంటే గత నెల నుంచి మహాకూటమిలో సీట్ల లొల్లి కొనసాగుతుంది. ఎన్నో పర్యాయాలు కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వెళ్లడం అధిష్టానం ముందు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. 

అయితే సీట్ల విషయంలో ఇప్పటి వరకు తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయి.  మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా... ఇంకా, అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఇతర పార్టీల ముందు చులకన అయ్యే ఛాన్స్ ఉందని..మహాకూటమి పై ప్రజలకు కూడా నమ్మకం పోయే అవకాశం ఉందని అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఈరోజు ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయ్యారు. కాగా, మహాకూటమి పొత్తులకు సంబంధించిన చర్చల వివరాలను ఆయనకు వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా... పొత్తుల వ్యవహారాన్ని ఇంకా తేల్చకపోవడంపై ఈ సందర్భంగా రాహుల్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: