తన మీద  దాడి జరిగిన తరువాత జగన్ ఎట్టకేలకు పాదయాత్రలో పాల్గొన్నాడు. అయితే జగన్ మీద జరిగిన దాడిని రాష్ర ప్రజలు తీవ్రంగా ఖండించడమే కాకుండా టీడీపీ స్పందించిన తీరు పై కోపంగా ఉన్నారు.  ఈ పాదయాత్రతో అధికార తెలుగుదేశం పార్టీకి ముచ్చేమటలు పోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా జగన్ పట్ల ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇది మరింత ఎక్కువవుతుందని ఇంటేలిజేన్సీ వర్గాల నివేదిక.


జగన్ తన పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకూ ప్రజలలో సానుకూలత పెరుగుతూనే ఉంది. ఆయనపై హత్య యత్నం అనంతరం పోలిసులు - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై ప్రజలలో తీవ్ర అసంత్రుప్తి నెలకొంది. నిందితుడిని అదుపులోకి తీసుకోవడం - ప్రశ్నించడం మినహా ఈ హత్యాయత్నం పై ఎలాంటి దర్యాప్తు జరగడంలేదు. ఇది కూడా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతోంది. హైకోర్టు కూడా ప్రభుత్వ తీరును తప్పు పట్టడంతో ప్రజలలో జగన్ పట్ల సానుకూలత పెరిగిందంటున్నారు.


జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!

తన కుమారిడిపై చేసిన హత్యాయత్నంపై జగన్ తల్లి విజయమ్మ స్పందిచిన తీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవరపెడుతోంది. విజయమ్మ తన రెండు చేతులు జోడించి ఇక ముందు ఇలాంటి హత్యాయత్నాలకు ప్రయత్నించకండి అంటూ కన్నీళ్లతో చేసిన విన్నపం తెలుగు ప్రజల కంట కన్నీరు తెప్పిస్తోంది.  హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని విజయమ్మ ఓ తల్లిగా ప్రార్దించడం తెలుగు మహిళలకు జగన్ పట్ల పుత్రవాత్సల్యం పుట్టింది .ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికలలో జగన్ పట్ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో సానుభూతి కలుగుతుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. పార్వతిపురం పాదయాత్ర ప్రభంజనం స్రుష్టిస్తుందని రాజకీయ పండితుల విశ్లేషణ.


మరింత సమాచారం తెలుసుకోండి: