అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు.  చాచా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను "బాలల దినోత్సవం"గా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే కదా..! చాచా నెహ్రూ మనదేశానికి తొలి ప్రధానమంత్రి. స్వాతంత్రం కోసం తెల్లవారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మాగాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. 

Image result for children's day

స్వాతంత్యం సంపాదించిన తరువాత మన దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా ఈయన పనిజేశారు. మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. మన దేశాన్ని దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత మన చాచాజీ సొంతం.

Image result for children's day

అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. నెహ్రూ చిన్న పిల్లల గురించి మాట్లాడుతూ...  పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు'' అని నెహ్రూ అనేవారు.


పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: