మహాకూటమి తరపున పోటీ చేయబోయే పార్టీల అభ్యర్ధుల టిక్కెట్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పెద్ద పార్టీలైన కాంగ్రెస్ అభ్యర్ధులపై అంతిమ నిర్ణయం వెలువడలేదంటే అర్ధముంది. మరి తెలుగుదేశంపార్టీ అభ్యర్ధుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి ఇంకా రాకపోవటమే విచిత్రంగా ఉంది. కాంగ్రెసె లో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది కాబట్టే ఏ నిర్ణయం ఒక పట్టాన సాధ్యంకాదు. చూడబోతే టిడిపిలో కూడా అదే పరిస్ధితి మొదలైనట్లుంది. అందుకనే ఈరోజు ఫైనల్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలని అనుకున్న టిటిడిపి అధ్యక్షుడు ప్రకటనను రేపటికి వాయిదా వేశారు. పోటీ చేసే అభ్యర్ధుల జాబితాపై ఇంకా నిర్ణయం కానందునే ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం.

 

అయితే, టిడిపి పోటీ చేసేందుకు 14 నియోజకవర్గాలు ఖరారయ్యాయి. అందులో 11 నియోజకవర్గాలకు అభ్యర్ధులు కూడా ఫైనల్ అయ్యారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 11 సెగ్మెంట్లలో పోటీ చేయబోయే అభ్యర్ధులు కూడా ఫైనల్ అయిపోయింది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు, ఉప్పల్లో వీరేంద్రగౌడ్, నిజామాబాద్ రూరల్ మండవ వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట మచ్చా నాగేశ్వరరావు, వరంగల్ పశ్చిమం రేవూరి ప్రకాశ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎర్ర శేఖర్, కుకట్ పల్లి పెద్దిరెడ్డి, శేరిలింగంపల్లి భవ్య ఆనంద ప్రసాద్, మక్తల్ కొత్తకోట దయాకర్ రెడ్డి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. అంటే ఈ సీట్లలో పై నేతలే పోటీ  చేయటం దాదాపు ఖాయమనే అనుకోవాలి.


ఖరారవ్వాల్సిన ముగ్గురు అభ్యర్ధులతో పాటు మరో ఐదు నియోజకవర్గాలను కూడా టిడిపి డిమాండ్ చేస్తోంది. ఆలేరు, ఇబ్రహింపట్నం, నకిరేకల్, జూబ్లీహిల్స్, పఠాన్ చెరువు, ఖైరతాబాద్, ఎల్బి నగర్ తో పాటు మరో మూడు సీట్లను కూడా డిమాండ్ చేస్తోంది. కాకపోతే వాటిపై కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇవ్వలేదని సమాచారం. మొత్తం మీద టిడిపితోను, టిజెఎస్ తో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు దాదాపు ఒక కొల్లిక్కి వచ్చినట్లే అనుకోవాలి. సిపిఐ విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: