రాజ‌కీయాల్లో ఒక‌ప్ప‌టికి ఇప్ప‌టికి ప‌రిస్తితిలో చాలా మార్పు క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు పార్టీల‌ను ప‌ట్టుకుని నాయ‌కులు వేళ్లా డేవారు. కానీ, ఇప్పుడు మారిన ప‌రిస్థితులు, ప్ర‌జ‌ల అభిరుచుల నేప‌థ్యంలో నాయ‌కుల‌ను ప‌ట్టుకుని పార్టీలు వేళ్లాడు తు న్న ప‌రిస్థితి చాలా జిల్లాల్లో క‌నిపిస్తోంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో కొంద‌రు నాయ‌కులు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌నే కాకుం డా.. స‌మీప‌నియ‌జ‌క‌వ‌ర్గాల‌ను సైతం ప్ర‌భావితం చేస్తున్నారు. కొంద‌రైతే.. జిల్లా మొత్తం మీద కూడా ప‌ట్టు సాధించారు. దీంతో పార్టీలే ఆయా నాయ‌కుల వెంట‌బ‌డుతున్నాయి. ఇలాంటి ప‌రిస్తితి ప‌శ్చిమ‌గోదావ‌రిలోని ఒక‌టి రెండు నియోజ‌క‌వ ర్గాల్లోనూ, గుంటూరులోని నాలుగు నుంచి ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌నిపిస్తోంది. 


అధికార టీడీపీకి చెందిన నాయ‌కులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే కాకుండా జిల్లా రాజ‌కీయాల‌పైనా ప‌ట్టు సాధించారు. దీంతో ఇలాంటి వారికి విప‌క్షం వైసీపీ గేలం వేస్తోంది. ఇలాంటి వారిలో ప్ర‌థ‌మ వ‌రుస‌లో ఉన్నారు ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు. ఒక‌రు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి కాగా, మ‌రొక‌రు మాగుంట శ్రీనివాసుల రెడ్డి. వీరిద్ద‌రికీ కూడా 30 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉంది. అంతేకాదు, త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయారు. తాము ఏదైనా కార‌ణాల వ‌ల్ల ఓడిపోయినా కూడా ప‌ట్టు మాత్రం త‌గ్గ‌లేదు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఓట‌మి పాల‌య్యారు. అయినా కూడా అన‌ధికార ఎమ్మెల్యే, ఎంపీలుగా వారు ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి ఆద‌ర‌ణ పొందుతున్నారు. 


ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ఇప్ప‌టికీ వీరి ఇంటి త‌లుపులు త‌డుతున్నారు. ఇలాంటి ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కులు వైసీపీలో ఉంటే.. ప్ర‌కాశం మొత్తం దున్నేయ‌వ‌చ్చ‌న్న‌ది వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆలోచ‌న‌. అందుకే ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా వీరిద్ద‌రికీ గేలం వేస్తూనే ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశాలతో సంతృప్తి చెందా నని…ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి అంగీకరించానని మాగుంట చెబుతున్నప్పటికీ..ఆయనకు ఉన్న బలహీ నతల ఆధారంగా పార్టీలో చేర్చుకోవాలని జగన్‌ చేస్తోన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ..ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న వ్యాపార లావాదేవీల వల్ల పార్టీ మారితే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటుందని మాగుంట‌కు తెలుసు. 


మాగుంట  చేసే లిక్కర్‌ వ్యాపారం  ప్రభుత్వంతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాలనుకున్నా మారలే డు. అయినా కూడా జ‌గ‌న్ త‌న ప్ర‌య‌త్నాల‌ను ఎక్క‌డా మాన‌లేదు. ఇక‌, క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి ప‌రిస్థితి కూడా ఇంతే... ప్ర‌ధానంగా చంద్ర‌బాబుకు క‌ర‌ణంకు చాలా గ‌ట్టి సంబంధాలే ఉన్నాయి. అటు రాజ‌కీయంగా క‌ర‌ణం బ‌ల‌హీన‌మైన ప్ర‌తిసారీ బాబు ఆయ‌న‌ను ఏదో విధంగా కాపాడుతూనే ఉన్నారు. అదేవిధంగా వ్యాపార విష‌యాల్లోనూ ఆయ‌న స‌హ‌క‌రిస్తున్నారు. ఇక‌, క‌ర‌ణంపై అనేక ఫ్యాక్ష‌న్ కేసులు ఉన్నాయి. ఆయ‌న బ‌ల‌మైన టీడీపీని వీడి బ‌య‌ట‌కు వ‌స్తే.. కేసుల తాచులు .. ఆయ‌న మెడ‌కు చుట్టుకునే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఈ ప‌రిస్థితులను ఆలోచించి.. ఆయ‌న టీడీపీ నుంచి బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్తితి ఉంది. ఇవ‌న్నీ తెలిసి కూడా జ‌గ‌న్ మాత్రం త‌న ప్ర‌య‌త్నాలు విరమించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: