ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా ప్రకృతి వైపరిత్యాలు భీతావాహాన్ని సృష్టిస్తున్నాయి.  ఆ మద్య హద్ హూద్ తుఫాన్ విశాఖను చిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడిప్పుడే విశాఖ కోలుకుంటుందనుకున్న సమయంలో ఈ మద్య శ్రీకాకుళంలో పరిసర ప్రాంతాల్లో తిత్లీ తుఫాన్ బీభత్సం సృష్టించింది.  ఇక తిత్లీ తుఫాన్ బాధ మర్చిపోక ముందే ఏపికి మరో ముప్పు వాటిల్లబోతుందని హెచ్చరికలు వస్తున్నాయి.  బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడి.. ‘గజ’ రూపంలో దూసుకొస్తోంది.
Image result for 'గజ' తుఫాన్
వచ్చే 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారి.. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర వైపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది శ్రీహరి కోటకు 980 కిలోమీటర్లు.. చెన్నైకు 840 కిలోమీటర్ల దూరంలో ఉంది.  అయితే ఈ ‘గజ’ప్రభావం ఎక్కువగా చెన్నైకి ఉన్నప్పటికీ..ఏపిలో కూడా దాని ప్రభావం చూపించబోతున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి.  చెన్నైతో పాటూ తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం నుంచి తమిళనాడుతో పాటూ పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Image result for 'గజ' తుఫాన్
అలాగే ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయంటున్నారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది.  విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. మరోవైపు తుఫాన్ కదలికలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  ఇప్పటికే తుఫాన్ల బీభత్సానికి ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు..పంట, ఆస్తి నష్టం జరుగుతుంది.  దాంతో ప్రభుత్వం ‘గజ’విషయంలో అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది.
Image result for 'గజ' తుఫాన్
తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు  ఆదేశించారు. కాగా,  ఈ నెల 14న శ్రీహరి కోటలో జీఎస్‌ఎల్వీ ప్రయోగం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని షార్ అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావం ఏమీ ఉండదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: