●ప్రజాస్వామ్యం తొక్కా, తోలు అంటూ చంద్రబాబునాయుడు మీడియా కాన్ఫరెన్స్ లో ప్రసంగం చేస్తుంటే ఒక్కరైనా ఒక్క జర్నలిస్ట్ అదేమిటి ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం సమంజసమా? ప్రజాస్వామ్యం పరిరక్షించడం అంటే ఇదేనా అని ఎందుకు అడగలేదు? 

● పెద్ద నోట్లు రద్దు చేయడం వాళ్ళ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు అని అబద్దం చెపుతుంటే అదేమిటి ఆ నాడు మీరే కదా పెద్ద నోట్లు రద్దు చేయమని లేఖ రాసింది అని ఒక్క జర్నలిస్ట్ ఎందుకు అడగలేకపోయారు? 

● నా మీద సిబిఐ, ఈడీ లను ప్రయోగిస్తారేమో అన్నప్పుడు మీరు 3 మాసాలా నుంచి అంటున్నారు అలాంటి ఛాయలేవీ కనిపించలేదు అని ఒక్కరు అడిగిన పాపాన పోలేదు ఎందుకు? 

● దేశంలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు పర్యటనలు చేస్తున్న అన్నప్పుడు మీరు కలిసిన జనతాదళ్ ఎస్, డీఎంకే కాంగ్రెస్ భాగస్వాములే కదా అని ఒక్క జర్నలిస్ట్ కు అయినా నోరు ఎందుకు రాలేదు? 

● మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించారు చంద్రబాబు నాయుడు. మరి 4 సంవత్సరాల 4 నెలలు మీరు వాళ్ళతో కలిసే ఉన్నారు కదా అప్పుడు కనిపించలేదా? అని విజయవాడ ప్రెస్ మీట్ లో ఒక్క జర్నలిస్ట్ అడగలేదు. నా అనుమానం అక్కడ జర్నలిస్టులు ఉన్నారా? టీడీపీ అభిమానులు ఉన్నారా? ఆహా నాకు తెలియక అడుగుతున్నా? ప్రజాస్వామ్య భక్షణ అంటే ఇదే... 


-By Comman Man



మరింత సమాచారం తెలుసుకోండి: