జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది పూర్తి రాజకీయ నాయకుడిగా మారిపోతున్నారు. గతంలో జనసేన పార్టీ స్థాపించిన ప్రారంభ రోజుల నుండి మొన్నటివరకు రాజకీయాల్లోకి ప్రశ్నించడానికి వచ్చాను..నాకు సిఎం అవ్వాలని ఆశ లేదు అంటూ ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్..తన తాజా పర్యటనలో మనసులో మాట బయటకు చెప్పేశారు.

Image may contain: 1 person

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికల విషయమై షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఆంధ్రరాష్ట్రంలో పలు సమస్యలపై మరియు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలే దీవెనలే తనను ముఖ్యమంత్రిని చేస్తాయని పవన్ అన్నారు. ఉద్దానంలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

Image may contain: 4 people

ఉద్దానంలో పరిస్థితిపై ఎంపీలు ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు. ప్రజలకు, యువతకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలన్నీ అమరావతిలో పెడితే ఎలా? అని పవన్ ప్రశ్నించారు. మళ్లీ ప్రాంతీయ వాదం పుట్టుకురావడం ఖాయమని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు తెగ హడావిడి చేస్తున్నారు.

Image may contain: 5 people, people standing

2019 ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు. ఇదే  క్రమంలో ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఎన్నికల ముందు నిద్ర లేచి అన్న సీఎం చేస్తారు ప్రజలు అంటూ కామెంట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి తన అన్న చిరంజీవి పరిస్థితి 2009 ఎన్నికల్లో ఏం జరిగిందో దాని కంటే దారుణంగా జరుగుతుందని..పవన్ కళ్యాణ్ డబ్బా కొట్టుకోవడం మానుకోవాలని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: