పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం వెనుక పెద్ద కుట్రే దాగుందనటానికి కీలక ఆధారాలు బయటపడ్డాయా ? జగన్ మీడియా అవుననే అంటోంది. అందుకు తగ్గట్లుగా ఓ పత్రాన్ని ప్రచురించింది. దాంతో జగన్ ను అంతమొందించేందుకు పెద్ద ప్లాన్ జరిగినట్లు అర్ధమవుతోంది. అక్టోబర్ నెలలో మాత్రమే విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు శ్రీనివాస్ రావుకు  విమానాశ్రయంలో క్యాంటిన్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి అనుమతి తీసుకున్న విషయం ఇఫుడు బయటపడటం సంచలనంగా మారింది. ఒక్క అక్టోబర్ లో మాత్రమే నిందితుడి ప్రవేశానికి అనుమతి ఎందుకు తీసుకున్నారన్నదే ఇఫుడు అందరిలోను మెదులుతున్న ప్రశ్న.

 

తాజాగా బయటపడిన ఆధారంతో జగన్ హత్యకు ఎప్పట్టి నుండో వెయిట్ చేస్తున్నారని, పక్కాగా ప్లాన్  చేస్తున్న విషయం స్పష్టత వచ్చింది. అయితే విచిత్రమేమిటంటే పరిస్దితులన్నీ క్యాంటిన్ యజమాని హర్షవర్ధన్నే అనుమానితునిగా చూపుతున్నా సిట్ అధికారులు మాత్రం హర్షాన్ని మాత్రం పెద్దగా విచారించలేదు. అందుకు కారణం ఏమిటంటే, హర్ష టిడిపిలో సీనియర్ నేతే కాకుండా చంద్రబాబునాయుడు, లోకేష్ కు సన్నిహితుడు కావటమే అని వైసిపి వర్గాలు ఆరోపిస్తున్నాయి. కుట్రకోణం ఎక్కడ బయటపడుతుందేమోనని, నిజ స్వరూపాలు బయటకు వస్తే ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం కూడా న్యాయవిచారణకు, సిబిఐ విచారణకు ఏమాత్రం అంగీకరించటం లేదని అనుమానం పెరిగిపోతోంది.


బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఏఎస్) డైరెక్టర్ జనరల్ తయారుచేసిన నివేదికను చూస్తే జగన్ పై హత్యాయత్నం పక్కా కుట్రే అని తెలిసిపోతోంది. కాకపోతే కుట్ర పన్నిందెవరు ? ఎందుకు పన్నారు ? అంత అవసరం ఏమొచ్చింది ? లాంటి విషయాలు తెలియాల్సుంది. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ను కుట్రదారులు వ్యూహాత్మకంగానే విమనాశ్రయంలోకి ప్రవేశపెట్టారట. తర్వాత అక్టోబర్ 1 నుండి 30 వరకూ ఎయిర్ పోర్టు చెక్ ఇన్ ఏరియా వరకూ వెళ్ళటానికి నిందితుని పేరుతో అనుమతి తీసుకున్నది హర్షవర్ధనే. ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులకు తెలియకుండానే విశాఖపట్నంలోని డైరెక్టరే అనుమతి ఇచ్చేశారు.

 

నిందితుడు విమానాశ్రయంలో ఎక్కడైనా సరే తిరిగేందుకు అక్టోబర్ 1 నుండి 30 వరకూ మాత్రమే పర్మిషన్ ఎందుకు తీసుకున్నారు ? ఎందుకంటే, హత్యాయత్నం జరిగింది అక్టోబర్ 25వ తేదీనే కాబట్టి. అంటే అంతకుముందు కూడా ప్రయత్నాలు చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కాకపోతే అవకాశం రాలేదు కాబట్టి సాధ్యం కాలేదు. ఒకవైపు హత్యాయత్నానికి అవకాశాలు రాకపోవటం, మరోవైపు తీసుకున్న గడువు ముగుస్తుండటం.

 

ఏం చేయాలో అర్ధంకాని పరిస్ధితుల్లో కుట్రదారులు తెగించి నిందితుడిని పురమాయించి జగన్ పై దాడికి ఒత్తిడి చేయించుంటారని అర్ధమైపోతోంది. సిట్ విచారణ అన్నది రాష్ట్రప్రభుత్వ కనుసన్నల్లో జరిగిది కాబట్టి ఎప్పటికీ నిజాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. అదే థర్డ్ పార్టీ విచారణ అంటే అన్నీ వాస్తవాలు బయటకు వచ్చే ప్రమాదముంది. అందుకనే థర్డ్ పార్టీ విచారణను చంద్రబాబు అడ్డుకుంటున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: