ఒక వైపు తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల కార్యక్రమం  మొదలైంది. కానీ ఇప్పటికీ మహాకూటమి భాగస్వామ్య పక్షాల మద్య సీట్ల పంపకాలు మాత్రం తెమలడం లేదు. ప్రస్తుతం మహా (ప్రజా) కూటమి నేతలంతా హస్తిన బాటపట్టారు. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో చర్చలు సా….గుతూ ఉన్నాయని సమాచారం.
మరి ఈ రోజు కూడా మహాకూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి రాకపోతే అంతే సంగతులు. మహాకూటమి మహావైఫల్య పథంలో పయనిస్తూనే ఉంది. ఎందు కంటే ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మరో వారంరోజుల పాటు నామినేషన్లు సాగుతాయి. వచ్చే శనివారంలోగా నామినేషన్లు సమర్పించాల్సిందే సోమవారం తుది గడువు. మద్యలో ఆదివారం సెలవు. 
mahakutami seats sharing in telangana కోసం చిత్ర ఫలితం
ఇప్పటి ఈ కూటమి పార్టీల్లో ఎవరికి ఎన్నిసీట్లు అనే దానిమీద మీద సరైన అవగాహన  లేదు. అవగాహనకు వచ్చామని ప్రకటించుకున్న కొంత ఫిష్షిగానే ఉందంటున్నారు. తర్వాత కథ అడ్డం తిరిగింది.ఒకటీ రెండు సీట్ల వద్ద ఈ పార్టీలు రచ్చరచ్చ చేసుకుంటున్నారు. మరి సీట్ల సంఖ్య తేలడానికే ఇంత కష్టం అయితే ఏ సీటు ఎవరికి కేటాయించాలి అనేది తేలేది ఎప్పుడో?  ఆ భాగవంతునికే తెలవాలి.
mahakutami seats sharing in telangana కోసం చిత్ర ఫలితం
సోమవారంలోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వాలి. ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. అయితే మహాకూటమిలో అలాంటి సయోధ్య కుదురుతుందా? అనేది పెద్ద ప్రశ్న! 
కార్యకర్తల్లో ఈ మహాకూటమి సీట్ల పంపకం మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు క్రిందిస్థాయిలో కార్యకర్తలు కలసి పోవటం అనేది అసంభవం అంటున్నారు. కారణం అవకాశవాదంతో అధిష్టానాలు కలిసిపోయినా నాలుగు దశాబ్ధాల జన్మ వైరం అంతగా తొలిగే విషయం కాదు. పార్టీలు కలసినంత తేలిగ్గా కార్యకర్త లంతా కలిసి పోతారా? అనేది తీరని సందేహమే. 
mahakutami seats sharing in telangana కోసం చిత్ర ఫలితం
అవతల కొన్ని సీట్ల పంపకం విషయంలో ఇప్పటికే వైషమ్యాలు మొదలయ్యాయి. మరో పార్టీకి ఆ సీట్లను కేటాయిస్తే సహించమని ఆయా పార్టీల కార్యకర్తలు ప్రకటించు కుంటున్నారు. మరి ఇన్ని చిక్కుముడుల మధ్యన మహాకూటమి రాణించగలుగుతుందా? అనేది అత్యంత  సందేహాస్పధమే. ఛాలా మంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం దీని వెనక ఏదో చంద్రమాయ కనిపిస్తుందని అంటున్నారు. 

fight between TDP and congress for seats కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: