chandrababu stand before rahul gandhi కోసం చిత్ర ఫలితం
నిద్ర లేచింది మొదలు, సాయంత్రం బెడ్డెక్కే వరకు, తెలుగు దేశం అధినేతకు అబద్ధాలు ఆడక పోతే నిద్రపట్టదు. అవసరమున్నా, లేకున్నా ప్రతిదానికి తానే గొప్ప, తానే ఆధ్యుడు, తన లాంటి నాయకుడు లెదని చెప్పే ప్రయత్నంలో, ఆడే అబద్ధాలు జనాలకు అసహ్యం కలిగిస్తున్నా, అవహేళనలు, అవమానాలు వారినుండి ఏదురైనా ఆయనలో మార్పురాదు.  ఆయనను అనుక్షణం అయినదానికి కానిదానికి సమర్ధించే పచ్చ మీడియా తన పద్దతి మార్చుకోదు.  

narasuruDu chandrababu కోసం చిత్ర ఫలితం

ఒక వైపు ఈ దేశంలో తన కన్నా సీనియర్ నేత, అనుభవఙ్జుడైన నాయకుడు, తనకన్నా గొప్ప పొలిటీషియన్ , తనకన్నా బహుముఖ ప్రఙ్జాశాలి, మేధావి, తన కన్నా గొప్ప పాలకుడు, మరొకరు లేడు అని చెప్పేవాడు. ఇందుకు ఋజువులుగా అనేక సందర్బాల్లో ప్రవచించిన ఉపన్యాసాల, మాటల వీడియోలు "యూ-ట్యూబు" లో వీరవిహారం చేస్తున్నాయి. 

narasuruDu chandrababu కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు తన గొప్ప అంటూ డబ్బా కొట్టుకున్న అనేత డబ్బాల మోదాలు, విచిత్రాలు, వింతలు,  వైనాలు ఎన్నో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పై విశాఖ విమానాశ్రయంలో జరిగి రాష్ట్రప్రజల్లో చెలరేగిన అలజడి అంతరాంతరాల్లో పొంగిపొరలుతున్న ఉద్వేగం దృష్టిని మళ్ళించటానికి, తనను తాను రాజకీయంగా రక్షించుకోవటానికి ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు నాటకాలు మొదలెట్తారు. “తనకన్నా ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్లు సీనియర్లు” అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ కాళ్లుపట్తుకొనే శకుని నీతిని ప్రదర్శించారు. ఆయన జీవితకాలంలో వేరెవరూ తనకంటే సీనియర్లు అని చెప్పకపోగా ఈ దేశంలో తనకంటే సీనియర్ నాయకుడు మరొకరు లేరని పలుసార్లు “ఆత్మస్తుతి” చేసుకున్న సందర్భాలు తెలియని తెలుగువాడు ఉండదు. 
chandrababu praised DMK Leader Stalin కోసం చిత్ర ఫలితం
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో “డబ్బా కొట్టుకునే అదే ఆత్మ స్తుతి” చేసుకునే చంద్ర బాబు డిల్లీలో మాత్రం తనకంటే వారు సీనియర్లనీ - వాళ్ల కాళ్లు కూడా మసాజ్ చేసే స్థాయి కి దిగజారి మాట్లాడాడు. ఎందుకంటే వారిని స్తుతించక పోతే రేపు ప్రధాని నుండి ఆయనపై ఏదైనా వేటు బడే సన్నివేశం వస్తే కనీసం తనకు మద్దతు నిచ్చే నాయకుల కోసం ఆయన దేశ యాత్రలు ప్రారంభించారు. 
united regional parties by chandrababu to attack modi కోసం చిత్ర ఫలితం
అలాగే  తాజాగా చెన్నై వెళ్లిన అక్కడ చంద్రబాబు స్టాలిన్ ను ఒకలెవెల్లో అంటే, ప్రధాని మోడీ కంటే స్టాలిన్ గొప్ప నేత అని చంద్రబాబు ఆయనకు డప్పు వాయించాడు. 
ఇలా డప్పు వాయిస్తూ కాలం గడపవలసిన రోజులు రావటంతో ఆత్మ స్తుతితో పాటు పరస్తుటి, శత్రు నింద మొదలెట్తి భజన భాగవతుడుగా మారాడు చంద్రబాబు.  స్టాలిన్ ఇప్పటి వరకూ తన జీవితాశయం అయిన ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలన్న కలను తీర్చుకోలేదు. ఎన్నోయేళ్లుగా తండ్రి చాటు కొడుకుగానే మిగిలిపోయాడు.
chandrababu praised DMK Leader Stalin  కోసం చిత్ర ఫలితం
నిజంగానే స్టాలిన్ సమర్థుడే అయితే, కరుణానిధి ఎప్పుడో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేవాడు. స్టాలిన్ సీఎం సీట్లో కూర్చుంటే డీఎంకే అల్లకల్లోలం అవుతుందని కరుణానిధి ఆగిపోయాడు. ఆఖరికి స్టాలిన్ మీద ఆయన సోదరులుకు కూడా ఇసుమంత నమ్మకం లేదు. అయితే అలాంటి చరిత్ర ఉన్న స్టాలిన్ను నాలుగు దశాబ్ధాల సుధీర్ఘరాజకీయ అనుభవం ఉందని అనుక్షణం చెప్పుకునే చంద్రబాబు మాత్రం స్టాలిన్ తోపు, తురుముఖాన్ అన్నట్టుగా ప్రవచించాడు బహిరంగంగానే.
chandrababu with farooq abdulla, Sarad pawar కోసం చిత్ర ఫలితం
చంద్రబాబు ఇంతగా దిగజారి దేశంలో 16పైగా ఉన్న ప్రాంతీయపార్టీల ఐఖ్యత సాధించినా, వాళ్ళు అంతా రేపు “చంచా-భజనగాడు” అని చెవులు కొరుక్కోరా?”  ఇంతా చేసే బదులు రహస్యంగా ఆ నరెంద్ర మోడీ కాళ్ళు, కెసిఆర్ మరియు వైఎస్ జగన్ చేతులు పట్టుకుంటే సరిపోతుందిగా?  తమిళనాట అలుముకున్న ఇంత రాజకీయ శూన్యతలో కూడా వచ్చేసారి తమిళనాడుకు స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడనే గట్టి నమ్మకం ఏ తమిళుడి మనసు లోనూ లేదు. అయితే చంద్రబాబు మాత్రం స్టాలిన్ ను ఇంత నిమ్న స్థాయికి దిగజారి పొగిడేశాడు.
united regional parties by chandrababu to attack modi కోసం చిత్ర ఫలితం
గతంలో దేశానికి ఇంత వరకూ ప్రధాన మంత్రులు అయిన వాళ్లలో కెల్లా, నరేంద్ర మోడీనే సమర్థుడు అని చంద్రబాబు వ్యాఖ్యానించాడు. అది కూడా శాసనసభలో సమస్త శాసనసభ్యులు, సభాపతి సాక్షిగా.  ఇప్పుడు మాత్రం నరేంద్ర మోడీ కన్నా, ఇంత వరకూ రాష్ట్రంలోని ఏ అత్యున్నత పదవి అలంకరించని స్టాలిన్ ను మహానాయకుడు పొగడుతూ ఉంటే ఆయన ఏ దశకు దిగజారిపోయారో అని ప్రజలంతా చర్చించుకోవటమే నిదర్శనం.

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: