అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ జాయ్ చరిత్ర సృష్టించింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మలాలా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.  విద్య నా ప్రాథమిక హక్కు దాన్ని లాగేసుకోవడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం అని పన్నెండేళ్ల వయస్సులో బాల ల హక్కుల గురించి బీబీసీలో ప్రశ్నించి.. మాటలతో తుపా కి తూటాలను ఎదుర్కొన్న బాలిక మలాలా.  అప్పటి నుంచే ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తాలిబన్లకు శత్రువులయ్యారు.
Related image
బాల కార్మిక వ్యవస్థకు పేదరికం కారణం కాదు, ఆ వ్యవస్థే పేదరికానికి దారితీస్తున్నది. నిరక్షరాస్యతను పెంచి పోషిస్తున్నది.. అన్నది మనదేశ నోబుల్ శాంతిబహుమతి గ్రహీత, కైలాస్ సత్యార్థి అభిప్రాయం. 2013లో బాలకార్మిక వ్యవస్థపై పోరాటం చేసిన ఇద్దరికి సంయుక్తంగా నోబెల్ బహుమతి రావడంతో ప్రపంచవ్యాప్తంగానూ, భారతదేశంలోనూ బాలకార్మిక వ్యవస్థపై దృష్టి మళ్లింది. మలాలా అంటే అర్థం - బాధాసర్పద్రష్ట. ఆమె బాధంతా చదువుకునే హక్కు కోసమే. పస్తూన్ కవయిత్రి, పోరాటయోధురాలు మెయివాండ్ మలాలా పేరులోని ‘మలాలా’ను ఆమె తండ్రి జియావుద్దీన్ కూతురికి పెట్టారు. 
Image result for Malala Yousafzai
యుద్ధవాతావరణానికి ఏ మాత్రం తీసిపోని స్వాత్ లోయలో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉన్నదో ప్రపంచానికి తెలియచేసేందుకు బీబీసీ పూనుకున్నది. స్వాత్‌లోయ అనుభవాలను మలాలా ‘గుల్ మకాయ్’ (జొన్న పువ్వు అని అర్థం) అనే మారుపేరుతో డైరీ రూపంలో బీబీసీ కోసం ఉర్దూలో రాసింది.  బాలికల పాఠశాలలన్నీ మూసివేయాలని 2009లో తాలిబాన్లు హుకుం జారీచేశారు. వందకు పైగా బాలికల పాఠశాల భవనాలను పేల్చివేశారు. ఉగ్రవాదుల మాటను ఖాతరుచేయని పౌరులు 2009 మార్చి తరువాత పెద్ద ఎత్తున మూల్యం చెల్లించవలసివచ్చింది. బడికి వెళ్లే బాలికలనే కాదు, ఉపాధ్యాయినులను కూడా బహిరంగంగా చంపడం మొదలుపెట్టారు. 
Image result for Malala Yousafzai
ఆడపిల్ల చదువు..బాలల హక్కుల కోసం మలాలా పోరాటం సాగించింది.   ప్రపంచం మొత్తం మీద విద్యావకాశాన్ని కోల్పోయిన 5,70,00,000 బాలబాలికల తరఫున 40 లక్షల మంది సంతకాలు చేసిన మహాజరును ఉపన్యాసం తరువాత సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్‌కి మలాలా అందచేసింది.  సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం.

నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే నాకు ఆదర్శ’మని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుష్టకార్యాలకు పాల్పడుతున్నారని నిష్కర్షగానే చెప్పింది. కానీ ఆ ఉపన్యాసంలో ఆమె ప్రపంచ పెద్దలను ఉద్దేశించి పలికిన మాట చరిత్రాత్మకం.  బాలల దినోత్సవం సందర్బంగా ప్రతి విద్యార్థికి  మలాల స్ఫూర్తిని అందరిలో నింపాలని ప్రతి ఉపాధ్యాయులు తెలుకోవాల్సిన విషయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: