చాచా నెహ్రూ పుట్టిన రోజైన నవంబర్ 14ను మనదేశంలో  "బాలల దినోత్సవం"గా జరుపుకుంటున్నాము. చాచా నెహ్రూ మనదేశానికి తొలి ప్రధానమంత్రి.   నవంబర్ నెల అనగానే బాలల దినోత్సవం, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు, బాలల హక్కుల దినోత్సవం... ఇలా నెల మొత్తంమీదా బాలలకు పండుగ రోజులే..! ఇందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, ప్రపంచ బాలల దినోత్సవాన్ని పిల్లలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.
Related image
1959వ సంవత్సరం నవంబర్ 20వ తేదీన బాలల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా ప్రపంచమంతటా బాలల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటుంటారు. బాలల కోసం 1946లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునిసెఫ్‌ను స్థాపించింది. మానవతా దృక్పధంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ బాలల హక్కులను పరిరక్షించడంలోనూ, వారి పురోభివృద్ధి, రక్షణ విషయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. బాలల కోసం అహర్నిశలూ శ్రమిస్తూనే ఉంది.
children
ప్రస్తుతం 155 దేశాకు విస్తరించిన ఈ సంస్థ 1965లో నోబెల్ శాంతి బహుమతిని పొందింది.  బాలల హక్కులపై ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న స్వచ్చంద సంస్ధలు బాలలను అడ్డుపెట్టుకొని లక్షలాది రూపాయలు స్వదేశి, విదేశి నిధులు దుర్వినియోగపరుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  బాల కార్మిక చట్టాలు, బాలల హక్కుల చట్టాలు కొంత మందికి చుట్టంగానే కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిశ్రమల్లో, షాపుల్లో, హోటళ్ళలో, ఇళ్ళల్లో, ఇటుక బట్టీలలో, బీడి పరిశ్రమలలో, పూలతోటలలో, పశువుల కాపర్లుగా బాల్యానికి దూరమై బతుకులీడుస్తున్నారు. తినుబండారాలు రోడ్లపై అమ్ము తూ, చెత్త కాగితాలు ఏరుకుంటూ, వయసుకు మించిన పనుల్లో నిరుపేద పిల్లలు పనిచేస్తున్నా రు.

ముఖ్యంగా బాలలు ఎక్కువగా ప్రమాదకరమైన పనుల్లో కనిపించడం అలా పనుల్లో పెట్టుకున్న వారిపై కేసుల నమోదులు తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి ఇది జగమెరిగిన సత్యం.  బాలల హక్కు కోసం పోరాటం చేసే వారికి ఎన్నో అవరోధాలు కూడా ఏర్పడుతున్నాయని..ఇంకా ఎన్నో ప్రదేశాల్లో బాలకార్మికులు కష్టాల కడలిలో మునిగిపోతూనే ఉన్నారని వారందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని బాలకార్మిక చట్టం తెలిజేస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: