చంద్రబాబునాయుడుకు హై కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. జగన్ పై హత్యాయత్నం ఘటనలో రెండు వారాల్లో సమాధానాలివ్వాలంటూ కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. పోయిన నెల 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో  జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం అందరకీ తెలిసిందే. జగన్ పై జరిగింది హత్యాయత్నమే అంటూ వైసిపి నేతలు అంటుంటే కాదు జగన్ పై జరిగింది కేవలం దాడి డ్రామా అంటూ చంద్రబాబు కొట్టి పారేశారు. పైగా దాడిని ఎగతాళి చేస్తు మాట్లాడారు. డిజిపి, మంత్రులు కూడా దాడిపై తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.


అదే సమయంలో విచారణపై ప్రభుత్వం సిట్ విచారణను ఆదేశించింది. అయితే, సిట్ విచారణపై నమ్మకం లేదని థర్డ్ పార్టీ విచారణ జరిపించాలంటూ జగన్, నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు అదంతా అవసరం లేదని సిట్ విచారణనే కొనసాగించారు. అదే విషయమై ప్రభుత్వ నిర్ణయంతో విభేదిస్తు జగన్ హై కోర్టులో కేసు వేశారు. దాంతో పది రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ రోజు జరిగిన విచారణలో థర్డ పార్టీ విచారణ అవసరం ఏంటనే విషయమై జగన్ తరపు లాయర్ వాదన వినిపించారు. అదే సమయంలో సిట్ విచారణ సరిపోతుందన్న వాదనను అడ్వకేట్ జనరల్ వినిపించారు.

 

అయితే, విచారణ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు అడ్వకేజ్ జనరల్ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. విమానాశ్రయంలో సిసి ఫుటేజి ఎందుకు లేదు ? ఎయిర్ పోర్టు క్యాంటిన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరిని సిట్ ఎందుకు విచారించలేదనే ప్రశ్నలకు అడ్వకేట్ జనరల్ సమాధానాలు ఇవ్వలేకపోయారు. దాంతో జగన్ తరపు లాయర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ముందుగా చంద్రబాబు, డిజిపి తదితరులకు నోటీసులివ్వాలని ఆదేశించింది. సమాధానాలు ఇవ్వటానికి రెండు వారాల గడువును ఇచ్చింది. చంద్రబాబుకు హై కోర్టు నోటీసులివ్వటంతో జగన్ పై హత్యాయత్నం కేసు ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: