వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అధికార తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహాలను రెడీ చేసుకుంటోంది. విజయమో వీర స్వర్గమో అన్న తీరున అధినేత చంద్రబాబు రాజకీయ మంత్రాంగాన్ని రచిస్తున్నారు. జనంలో సానుకూలత ఎలా తీసుకురావాలన్న దానిపైనేఅ అయన చూపు ఉంది. మొత్తం పదమూడు జిల్లాల్లో పార్టీ పరిస్థితిని ఆయన బాగా అధ్యయనం చేస్తున్నారు.


గెలుపు గుర్రాలకే :


ఇదీ ఇపుడు చంద్రబాబు పెట్టుకున్న సూత్రం. ఎవరికి నియోజకవర్గంలో బాగుందో చూసి మరీ టికెట్ ఇస్తామని బాబు పదే పదే చెబుతున్నారు. పార్టీ తరఫున వారికే పెద్ద పీట వేస్తామని కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. ఇందుకోసం బాబు పార్టీ అంతర్గత సర్వేలను నమ్ముకుంటున్నారు. ఎక్కడికక్కడ వాటిని జరిపిస్తూ ఎమ్మెల్యేల పనితీరును గురించి ఆరా తీస్తున్నారు. దాని వల్ల కీలక సమాచారం అంతా ఇపుడు బాబు వద్దకు చేరిందని తెలుస్తోంది.


సగం మందికి ఝలక్ :


టీడీపీ విషయం చూసుకుంటే ఎమ్మెల్యేల్లో సగానికి సగం మందికి జనంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. నాలుగున్నరేళ్ళ కాలంలో సొంత పనులు, ప్రయోజనాలకు చాలా మంది ఎమ్మెల్యేలు పెద్ద పీట వేశారు తప్ప జనం గోడును పట్టించుకొలేదన్న రిపోర్టులు ఇపుడు పార్టీ హై కమాండ్ వద్ద ఉన్నాయి. అంటే పోయిన ఎన్నికల్లో పార్టీ తరఫున 102 మంది గెలిస్తే వారిలో ఇపుడు యాభై మందికి పైగా టికెట్లు గల్లంతు కావడం ఖాయమని అంటున్నారు. 


ఫిరాయింపుల కధ ఇంతే:


ఇక మరో ఇరవమందికి పైగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారి పరిస్థితి అతి దారుణంగా ఉందని అంటున్నారు వారిపై మొదటి రెండేళ్ళు ఏమీ చేయలెదన్న విమర్శలు ఉంటే తరువాత కాలం ప్రజా తీర్పును మంట కలిపారన్న ఆగ్రహం ఉంది. దాంతో బాబు వీరిని సులువుగానే పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే బాబు తో పాటు ఇపుడున్న క్యాబినెట్లో 26 మంది మంత్రుల్లొ  ఎమ్మెల్సీలు పోగా  కొందరికి టికెట్ దక్కకపోవచ్చునన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: