ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు కొనసాగుతుంది.  వచ్చే నెలలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గత నెల నుంచి ప్రచారాల జాతర మొదలు పెట్టారు.  టికాంగ్రెస్, టిటిడిపి,టిజెఎస్,సిపిఐ లు మహాకూటమిగా ఏర్పడి ప్రచారం చేస్తున్నాయి.  మొన్నటి వరకు మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు విషయంలోనే తర్జన భర్జన కొనసాగుతూ వచ్చింది.   ఏపిలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్య పార్టీలు అయిన టిడిపి, వైసీపీ, జనసేన ఇప్పటికే ప్రచారాల్లో మునిగిపోయారు. 
Image result for pawan kalyan
 గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించిన పవన్ కళ్యాన్ అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు.  రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ ఇప్పుడు ప్రచారంలో మునిగిపోయారు.  అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే పవన్ ప్రచారంలో తెల్ల బట్లలతోనే దర్శనం ఇస్తున్నారు..ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి పంచెకట్టుపై కనిపిస్తున్నాడు. దీనిపై ఏపిలో రక రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు పంచె ఎందుకు కడుతున్నాడో ప్రజలకు తెలియజేశాడు.
Related image
తాను పంచెకట్టడంలో ఎటువంటి విశేషం లేదని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటడానికే పంచె కడుతున్నట్టు చెప్పారు. అంతే కాదు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులను దోపిడీ దారులుగా చిత్రీకరిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.  అక్కడి ఆంధ్రుల ఓట్లు కావాలి..అన్ని అవసరాలు తీర్చుకుంటారు..వారినే విమర్శిస్తున్నారు..ఈ విషయంపై ఒక్క ఆంధ్రా నాయకుడు కూడా ఇదేంటని ప్రశ్నించలేదన్నారు. కాంట్రాక్టుల కోసం, ఇతర ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. అయితే, జనసేన మాత్రం ఆంధ్రులకు అండగా ఉంటుందని, వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని పవన్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: