రాజకీయాల్లో ఇదొక కొత్త పాయింటే. లాజిక్ కూడా సరిపోతుంది. కానీ జనం దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్నదే చూడాలి. భారతీయ రాజకీయ చరిత్ర  తీసుకున్నపుడు ఆ పాయింటుకు పెద్దగా విలువ లేదు. కానీ ఏపీలో మాత్రం జనసేనాని అదే పాయింటు చుట్టూ తిరుగుతున్నారు. బాబుని అక్కడే కార్నర్ చేయాలనుకుంటున్నారు. మరి జనం నమ్ముతారా...


బాబు వయసు మైనసా :


వచ్చే ఎన్నికల్లో ఓ పార్టీ గెలవడానికి, మరో పార్టీ ఓడడానికి పాలనాపరమైన అంశాలే దోహద‌డతాయా. లేక వేరే ఇతర అంశాలు కూడా ప్రభావితం చేస్తాయా. ఆ విధంగా చూసుకుంటే వాటి పాత్ర ఎంత శాతం. మరి ఈ లెక్కలు జనసేనాని వద్ద ఉండవనుకోలేం కానీ ఆయన మాత్రం మేజర్ పాయింట్లను వదిలేసి మైనర్ పాయింట్ల చుట్టూనే తిరుగుతున్నారు. అదే బాబు వయసు గురించి తరచూ చేసే ఆరోపణలు. బాబుకు ఎక్కువ వయసు  ఇపుడు మైనస్ పాయింట్ అన్నది పవన్ ఉద్దేశ్యం కాబోలు.


డెబ్బయికి చేరువలో :


వచ్చే ఎన్నికల్లో బాబు పోటీ చేసేనాటికి ఆయన డెబ్బయి పడిలో అడుగుపెడతారు. అంటే ఆయన సీనియర్ మోస్ట్ సిటిజన్ అవుతారన్న మాట. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్, పవన్ నలభై  పడిలోనే ఉంటారు. రాజకీయ లెక్కల ప్రకారం వారిద్దరూ యువకులు కిందనే  చూడాలి. మరి యువతరానికి వ్రుధ్ధతరానికి వచ్చే ఎన్నికలు పోటీ అన్నమాట. నిజంగా అది అలా ఉండదు కానీ పవన్ ఈ పొలిటికల్ గేం ని ఆ కోణంలో తిప్పాలని చూస్తున్నారు.


వయసు అయిపోయిందట :


పవన్ ఇపుడు ప్రతి సభలోనూ చంద్రబాబు వయసు గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. బాబు వయసు అయిపోయిందని, ఆయన పాలనా పగ్గాలను సరిగ్గా నడిపించలేకపోతున్నారని పవన్ విమర్శలు చేస్తున్నారు. ఎంతసేపూ సమీక్షలు తప్ప ఆచరణ లెదని కూడా కామెంట్స్ చేస్తున్నారు. బాబు తన వారసునికి సీఎం సీటు ఇచ్చేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని మరో బాణాన్ని కూడా పవన్ వేశారు. బాబు రిటైర్ అయిపోయి యువతకు  అవకాశం ఇవ్వాలని కూడా పవన్ డిమాండ్ చేస్తున్నారు.


జనం నమ్ముతారా :


మన దేశంలో సీనియర్ పొలిటీషియన్లను చూసుకుంటే బీజేపీలో ఎల్కే అద్వానీ నుంచి కేరళ సీం విజయన్ వరకూ ఎందరో ఉన్నారు. బాబు కంటే పెద్ద వయసు వారు కూడా దేశంలో చురుకుగా రాజకీయాలు చేస్తున్నారు. అసలు వాజ్ పేయ్ ప్రధాని అయ్యేనాటికి ఆయన వయసు 75 దాటి ఉంది. మొరార్జీ దేశాయి కూడా అంతే. ఈ దేశంలో వయసుని కొలమానంగా తీసుకుని ఓట్లు వేసే పరిస్థితి ఎపుడూ లేదు. అలాంటపుడు బాబు ఏజ్ ని మైనస్ గా చూపించి నెగ్గుకువద్దమని పవన్ వేస్తున్న ఈ ఎత్తులు పారతాయా అంటే సందేహమేనని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: