ఏడాది క్రితం జగన్ మొదలెట్టిన పాదయాత్ర నెమ్మదిగా సాగుతూ ఇపుడు దాదాపుగా క్లిమాక్స్ కి చేరుకుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ అతి కీలకం, రాజకీయ తెరపైన కూడా అదే సెంటిమెంట్ పండాలి. జగన్ పాదయాత్ర ఒక్క జిల్లా మిగిలి ఉండగానే క్లైమాక్స్ కి కావాల్సిన రంగం అంతా సిధ్ధమైపోయింది. ఇపుడు జగన్ పాదయాత్ర చూట్టూ ఏపీ రాజకీయాలను కేంద్రీక్రుతం చేయడంలో వైసీపీ సక్సెస్ అయినట్లే.


హత్యాయత్నం ఘటనతో :


జగన్ తన పాదయాత్ర తాను చేసుకునిపోతున్నారు. ఓ విధంగా రోటీన్ అయిందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఇంతలో విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం ఘటన జరిగింది. దాంతో ఏపీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. హత్య ఎవరు చేశారు. ఎందుకు చేశారు అన్నది పక్కన పెడితే జగన్ సెంట్రల్ పాయింటు గా ఇపుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. అన్ని రాజకీయ పక్షాలు ఈ దాడి మీద, జరుగుతున్న రచ్చ మీద మాట్లాడక తప్పేట్లు లేదు.


జనప్రభంజనం :


ఇక హత్యాయత్నం తరువాత జగన్ కి ఆదరణ మరింతగా పెరిగింది. ఆయన్ని చూసేందుకు వచ్చే జనం ఎక్కువవుతున్నారు. జగన్ సైతం వ్యూహాత్మకంగా తనపైన జరిగిన దాడిపై ఎక్కడ స్పందించకుండా మౌనంగా ఉంటున్నారు. దాని వల్ల కూడా రోజు రోజుకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. జగన్ ఏం చెబుతారో అన్నది టీడీపీ నుంచి సామన్య ఓటరు వరకూ అందరిలోనూ ఉంది. కానీ దాన్ని అలా ఉంచి ముందుకు సాగడంలోనే జగన్ వ్యూహం దాగుందంటున్నారు.


చేరికలు పెరిగాయి :


ఇక సుదీర్ఘ విరామం తరువాత జగన్ ప్రారంభించిన పాదయాత్రలో చేరికలు బాగా పెరిగాయి. బీసీ జేయేసీ అధ్యక్షుడు  మార్గాని నాగేశ్వరరావు తొలి రోజే పార్టీలో చేరిపోతే మలి రోజు జగన్ సొంత జిల్లాకు చెందిన రాజకీయ మేధావి సీ రామచంద్రయ్య వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం షాకింగ్ న్యూస్ గా చెప్పాలి.
 మొత్తానికి మరో నెల వరకూ జగన్ పాదయాత్ర జరిగే అవకాశం ఉంది. ఇదె టెంపోని కొనసాగిస్తూ మరిన్ని చేరికలతో అధికార పార్టీకి షాకులు ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. క్లైమాక్స్ లో  ఎన్నో మసాలాలు ఉంటాయని వైసీపీ రాజకీయ చిత్రం ఇప్పటి నుంచే వూరిస్తోంది కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: