తెలంగాణలో మొన్నటి వరకు టి కాంగ్రెస్, టిటిడిపి, టిజెఎస్, సిపిఐ మహాకూటమిగా ఏర్పడబోతున్న విషయం తెలిసిందే.  తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ని ఓడించాలని పంతం పట్టింది టికాంగ్రెస్.  ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడం చర్చనీయాంశం అయ్యింది.  అయితే మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు విషయంలో మొన్నటి వరకు ఉత్కంఠంగా కొనసాగిన విషయం తెలిసిందే.  అయితే టీడిపికి 14, టీజెఎస్ కి 8, సీపీఐ కి 3 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో టీడిపి అభ్యర్థుల పేర్లు కూడా ప్రస్థావించింది.  కొన్ని మాత్రం ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. 

అయితే, తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త ఒకటి ఇటు తెలంగాణలోనూ, అటు ఎన్టీఆర్ కుటుంబంలోను హాట్ టాపిక్‌గా మారింది.  మహానటులు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ మొదటి నుంచి టిడిపికి విధేయుడుగా ఉంటూ వచ్చారు. ఈ మద్య రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ టిడిపి పొలిటికల్ బ్యూరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈయన కూతురు సుహాసినిని కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నట్టు వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్యే సుహాసిని. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వద్ద కూడా  ఈ విషయం చర్చించినట్టు చెబుతున్నారు. 

గతంలో నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాన్ రామ్ ని కుకట్ పల్లి బరిలో నిలవబోతున్నారని వార్తలు వచ్చాయి.  కాగా, ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దింపాలన్న ఉద్దేశంతోనే ఆమెను అనుకుంటున్నట్టు టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.   వాస్తవానికి హరికృష్ణ కుమారుడైన కల్యాణ్‌రామ్, సుహాసినిలలో ఎవరో ఒకరిని బరిలోకి దింపాలని భావించామని, అయితే, కల్యాణ్ రామ్ ఆసక్తి కనబరచలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుహాసినిని ఎన్నికల బరిలో దించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: