ఒకసారి అధికారంలోకి వచ్చాక దాన్ని వదలి జీవించటం అసంభవం. మరి పదవీలాలసతో జీవించేవాళ్లకు అది మరీకష్టం. తెలంగాణా నుండి తరిమివేయబడ్ద ఔరంగ జేబు వ్యక్తిత్వం సొంతం చేసుకున్న టిడిపి అధినేత తిరిగి తెలంగాణాలో తన పార్టీని పునఃప్రతిష్టించాలని పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా నైనా తెలంగాణాపై రాజకీయాదిపత్యం చలాయించటం ఆయన సంపద, భవనాలు తదితరాలు కాపాడుకోవటానికైనా అవసరం.

chandrababu naidu with rahul gandhi కోసం చిత్ర ఫలితం 

అందుకే తన పాదరక్షల్లాంటివాడైన రెవంత్ రెడ్డి ద్వారా నైనా తన అధికారం నిలబెట్టుకోవటానికి చేసిన “ఓటుకు నోటు కేసు” తో కావలసినంత అప్రతిష్ట మూటకట్టు కొని తెలంగాణా ప్రజల్లో తన పరువు ప్రతిష్టను తలను అవనతం చేసుకున్నా, ఇంకా అధికార దాహంత్గో తప్పును చట్టంద్వారా, న్యాయవ్యవస్థను నియంత్రించైనా అనుకున్నది సాధించాలనే తాపత్రయంతో అదే రేవంత్ రెడ్దిని ఎరగా వేసి కాంగ్రెస్ సరోవరంలో పాదంపెట్టి తద్వారా కాంగ్రెస్ పై పట్టు సాధించాడు.

revant chandra కోసం చిత్ర ఫలితం

అయితే తన బందువులో, స్నేహితులో, తన సామాజిక వర్గం వాళ్లో శాసనసభలో ఉండాలన్న  అవసరం గుర్తించి వాళ్ల ప్రాభవం నిండుగా ఉండి, సభపై ప్రభావశీలత కలిగి ఉండాలిన్న ఉద్దేశంతో, టిడిపికి అంతగా అవకాశం ఉండని తరుణంలో కాంగ్రెసును, తన సొఫానంగా వాడుకోవటానికి ప్రణాళిక రచించారు. 

 

కాంగ్రెస్ అనామకుడు రాహుల్ గాంధిని రేవంత్ రెడ్ది ద్వారా బుట్టలో పెట్టి తనకు అనుకూలమైన సభ్యులకు శాసనసభ సీట్లు కేటాయించేలా వ్యూహంపన్నాడని ప్రచారం లో ఉంది. అసలు కాంగ్రెసే ఎన్నికల్లో పోటీచెసే సభ్యుల జాబితా చంద్రబాబు అంగీకారంతో విడుదల చేయించిం దని అభిఙ్జవర్గాల కథనం. అంటే తెలంగానాలో కాంగ్రెస్ తరపున ఎన్నిక్కయ్యే సభ్యులంతా బాబుకు ఆమోదయోగ్యులే అవటంతో తన టిడిపి అభ్యర్ధుల సంఖ్య ఆపై ఎంపికపై పట్టుపట్టలేదు.

 revant chandra కోసం చిత్ర ఫలితం

ఇక తన బందువులు, కులజనులు ప్రత్యక్షంగా శాసనసభ్యులుగా ఉండే ప్రణాళికలో చంద్రబాబు వ్యూహం అద్భుతం.  తన స్వజనుడు బాలకృష్ణ మిత్రుడు భవ్య ఆనంద్ ప్రసాద్ శేరిలింగంపల్లి టిడిపి టికెట్ పొందగా - కూకటపల్లి అభ్యర్ధిపై ఎంపిక ప్రస్తుతం జరుగుతుంది.

revant chandra కోసం చిత్ర ఫలితం 

₹ 500 కోట్ల వెలకు తనకు కాంగ్రెస్ అమ్ముడు పోయినట్లు ప్రచారంలో ఉండగా - మహాకూటమిలో సర్వం తెరవెనుక అంతాతానేయి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ, కూటమి లోని మిగిలిన పార్టీలతో సీట్ల విషయంలో ఎలాంటి పేచి పెట్టకుండా సంయమనం వహిస్తుంది. అదే సమయంలో తనకు బాగా పట్టున్న ప్రాంతాలనే ఎంచుకుని, అక్కడి నుంచి బలమైన తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపుతోంది.

bhavya anand prasad కోసం చిత్ర ఫలితం 

ఈ క్రమంలో తొలి జాబితాలో తొమ్మిది మందిని ప్రకటించింది, అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని కీలక నియోజకవర్గాలను "సస్పెన్స్‌" లో పెట్టింది. ఇక హైదరాబాద్‌ లో తొలి నుంచి తెలుగు దేశానికి పట్టున్న కూకట్‌పల్లి నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో ప్రదానాంశంగా మారింది.

సంబంధిత చిత్రం 

కూకట్‌పల్లి నియోజకవర్గం కోసం పార్టీలోని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నప్పటికీ తెలుగు దేశం అధినేత క్రియాశీలకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, గెలుపుగుర్రం ఎక్కటానికి అవకాశం ఉన్నఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో ఒకరిని,  అదీ నందమూరి హరికృష్ణ కుటుంబానికే ప్రాధాన్యత నిస్తూ బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.

 chandrababu & suhasini కోసం చిత్ర ఫలితం

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ కుటుంబంలోని ఒకరికి ఈ సీటును కేటాయించే అవకాశం కనిపిస్తోందని టిడిపిలో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే ఈ విషయాన్ని కల్యాణ్‌ రామ్ వద్ద ప్రస్తావించగా తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, ప్రస్తుతం తనకు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని తప్పుకున్నట్లు వినిపిస్తుంది.

chandrababu & suhasini కోసం చిత్ర ఫలితం

చివరకు అనేక తర్జనబర్జనల తరవాత హరికృష్ణ కుమార్తె సుహాసినీ టీడీపీ అభ్యర్థిగా ఖరారైనట్లు గా పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్యే సుహాసినీ. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఈ వార్త విని సంబరాలు చేసు కుంటున్నారు.

chandrababu put chek to junior NTR కోసం చిత్ర ఫలితం


సుహాసిని మాత్రమే ఎందుకు? జూనియర్ కు చెక్ చెప్పేందుకేనా?  

నందమూరి తారక రామారావు పోలికలతో, నటనా చాతుర్యంలో కూడా "ఢీ" కొనగలిగే సత్తా ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ ఎప్పటికైనా టీడీపీ నాయకత్వం కోసం పోటీ పడే అవకాశం ఉననే అభిప్రాయం చంద్రబాబుకు ఉండేది. అందుకే హరికృష్ణ మరణం నేపథ్యంలో హరికృష్ణ కుటుంబాన్ని కూడా ఆకర్షించి జూనియర్ కు చెక్ పెట్టాలన్న దానిపై చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. 
సంబంధిత చిత్రం
అందులో భాగంగా ముందుగా కల్యాణరామ్‌ను రాజకీయంగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకటపల్లి నుంచి పోటీచేయాల్సింది గా కల్యాణ్రరామ్ ను టీడీపీ నేతల బృందం వెళ్లి కలిసింది. కానీ అందుకు కల్యాణ రామ్ సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని పేరును తెరపైకి తెస్తున్నారు. 
kalyan ram chandrababu కోసం చిత్ర ఫలితం
బాబు బిట్వీన్ ది లైన్స్-బిహైండ్ ది స్క్రీన్స్ 

సుహాసిని పోటీకి అంగీకరిస్తే, అది పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్‌ ను ఒంటరిని చేయడమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నందమూరి కుటుంబం  నుంచి తనకు గానీ, తన కుమారుడు లోకెష్కు గానీ రాజకీయంగా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకే చంద్రబాబు హరికృష్ణ కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకుంటు న్నాడని అభిఙ్జవర్గాల కథనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: