ఎన్టీయార్ కుటుంబాన్ని వాడుకోవటానికి చంద్రబాబునాయుడు మరో కొత్త ఎత్తు వేస్తున్నట్లు కనబడుతోంది. రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ లోని కుకట్ పల్లి నియోజకవర్గంలో దివంగత నందమూరి హరికృష్ణ కూతురు  సుహాసినిని పోటి చేయించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ సుహాసిని గనుక పోటీకి ఒప్పుకుంటే చంద్రబాబుకు రెండు విధాలుగా లాభం కలుగుతుందట. మొదటిది సుహాసిని గెలిస్తే హరికృష్ణ కుంటుంబం చంద్రబాబు గుప్పిట్లో ఇరుక్కుపోతుంది. అదే సమయంలో జూనియర్ ఎన్టీయార్ ను పార్టీకి వీలైనంతగా దూరం పెట్టేయొచ్చని చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారట.

 

పార్టీలో ఎప్పటికైనా నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీయార్ నుండే పోటీ తప్పదన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా తీసుకుంటే జూనియర్ ముందు లోకేష్ ఎందులోను పోటికి నిలబడలేరు. ఏదో చంద్రబాబు నీడన బతికేస్తున్నాడు. చంద్రబాబు లేకపోతే లోకేష్ గతేంటో అందరికీ తెలుసు. ఆ విషయంలో చంద్రబాబుకు కూడా క్లారిటీ ఉంది. అందుకనే తానున్నపుడే లోకేష్ ను పార్టీ నేతలపైనే కాకుండా జనాల మీద కూడా బలవంతంగా రుద్దుతున్నారు.

 

నందమూరి కుటుంబంలో ఒక్క హరికృష్ణ నుండే అప్పుడప్పుడు చంద్రబాబుకు షాకులు తగులుతుండేవి. అటువంటిది హరికృష్ణ మరణంతో ఆ అడ్డంకులు కూడా దాదాపు తొలగిపోయినట్లే. కానీ జూనియర్ రూపంలో ప్రమాదం ఇంకా పొంచి ఉందని పార్టీ నేతలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. హరికృష్ణ బతికున్నంత కాలం కుటుంబసభ్యులెవరూ చంద్రబాబు దగ్గరకు వెళ్ళలేదు. అందుకనే హరికృష్ణ తర్వాత ఆ కుటుంబంపై కూడా పట్టుసాధించాలని చంద్రబాబు అనుకున్నారట. అందుకే కుకట్ పల్లిలో పోటీ చేయాలని ముందు హరికృష్ణ కొడుకు కల్యాణరామ్ ను అడిగించారు చంద్రబాబు. అయితే, పోటికి హరికృష్ణ అంగీకరించలేదు.

 

అసలు ఒకదశలో జూనియరే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా హరికృష్ణ కూతురు సుహాసినిని పోటీలోకి దింపాలని ప్రయత్నాలు మొదలయ్యాయట. సుహాసిని గనుక పోటీకి ఒప్పుకుంటే ఎలాగైనా గెలిపించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. సుహాసిని గెలిస్తే హరికృష్ణ కుంటుంబంపై ప్రత్యక్షంగా చంద్రబాబు పట్టు సాధించినట్లే అవుతుంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇప్పటికే కుకట్ పల్లి టిక్కెట్టును సీనియర్ నేత పెద్దిరెడ్డికి ప్రకటించారు. మరి ఆయనేమవుతారు ? ఏమవుతారంటే చంద్రబాబును నమ్ముకుంటే...


మరింత సమాచారం తెలుసుకోండి: