జగన్ మీద జరిగిన దాడి ని అపహాస్యం చేసిన టీడీపీ చివరికి కోర్ట్ నుంచి మాత్రం తప్పించుకోలేక పోయింది. దీనితో టీడీపీ ఆత్మ రక్షణ లో పడింది. దాడిచేసిన నిందితుడ్ని వైఎస్సార్సీపీ కార్యకర్త అనీ, జగన్‌ అభిమాని అనీ.. ఘటన జరిగిన వెంటనే ప్రచారంలోకి తీసుకురావడం కూడా 'కుట్ర కోణం'లో భాగమేనన్నది వైఎస్సార్సీపీ వాదన. తృటిలో ప్రాణాపాయం తప్పిందిగానీ, లేదంటే జరగరాని ఘోరం జరిగిపోయేదేనని సాక్షాత్తూ వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.

Image result for jagan attack

ఇటు వైఎస్సార్సీపీ అనుమానాలు, అటు న్యాయస్థానం నోటీసులు.. వెరసి, అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది పరిస్థితి. మామూలుగా అయితే ఇలాంటి కేసుల్ని 'మమ' అన్పించేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అయితే, వైసీపీ తమ అధినేతపై జరిగిన హత్యాయత్నాన్ని లైట్‌ తీసుకునే పరిస్థితుల్లో లేదు. జాతీయ స్థాయిలో చంద్రబాబు సర్కార్‌ తీరుని ఎండగడ్తోంది. ఫిర్యాదు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరకూ వెళ్ళింది.

టీడీపీ మెడపై 'కోడి' కత్తి

ఈ కేసులో 'ఎ1 నిందితుడు చంద్రబాబే' అని వైసీపీ ఆరోపిస్తోంది. దాడి ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.? అన్న విషయాలు విచారణలో తేలతాయేమోగానీ.. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే.. నిర్లక్ష్యంగా మాట్లాడిన పాపానికి, చంద్రబాబు అండ్‌ టీమ్‌.. ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పేలాలేదు. వివాదం ముదిరి పాకాన పడ్తున్న దరిమిలా, 2019 ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌పై హత్యాయత్నం - టీడీపీ నిస్సిగ్గు రాజకీయం అనే అంశం కూడా హైలైట్‌ అయ్యే అవకాశాల్లేకపోలేదు. అదే జరిగితే, జగన్‌ విషయంలో గతి తప్పిన కోడి కత్తి, టీడీపీ మెడ మీద గట్టిగానే పడనుందన్నది నిర్వివాదాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: