తెలంగాణాలో ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే టీఆర్ఎస్ 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం..వారు నామినేషన్ లు కూడా వేయడం జరుగుతుంది.  గత నెల నుంచి టిఆర్ఎస్ జోరుగా ప్రచారం మొదలు పెట్టింది.  అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ని టార్గెట్ చేసిన టి కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.  ఈ కూటమిలో టీటిడిపి, టిజెఎస్,సీపీఐ లు ఉన్నాయి.  అయితే మొన్నటి వరకు మహాకూటమి సీట్ల సర్ధుబాటులో గందరగోళం నెలకొంది. 


కాంగ్రెస్ పెద్దలు పలుమార్లు ఢిల్లీ కి వెళ్లడం అక్కడ జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధీ తో సంప్రదింపులు జరపడం జరిగింది.  మొత్తానికి టిటిడిపి - 14,టీజెఎస్ - 8, సీపీఐ-3 సీట్లు కేటాయించారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం 65మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. తాజాగా రెండో జాబితాను రిలీజ్ చేసింది. 


రెండో జాబితాలో 10మంది అభ్యర్థులు ఉన్నారు.  దీంతో తొలి జాబితా, రెండో జాబితా కలిపి మొత్తం 75 మంది అభ్యర్థుల జాబితా విడుదలయింది. మరో 19 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే దాదాపు కాంగ్రెస్ పోటీ చేస్తే అభ్యర్థుల జాబితా పూర్తిగా విడుదలైనట్లుగా భావించవచ్చు. అయితే మొదటి జాబితా విడుదల సమయంలో ఖానాపూర్ టికెట్ రమేష్‌ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ కార్యకర్తలు పట్టుబడినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ రమేష్‌ వైపే మొగ్గుచూపింది.  ఎల్లారెడ్డి స్థానం  జాజల సురేందర్‌ దక్కించుకున్నారు. ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్‌కు టికెట్ దక్కింది.  ఇక రెండో జాబితాలోనూ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పేరు లేదు. 


రెండో జాబితాలోని అభ్యర్ధులు :

  • ఖానాపూర్ - రమేష్ రాథోడ్
  • ఎల్లారెడ్డి - జాజల సురేందర్
  • ధర్మపురి - లక్ష్మణ్ కుమార్
  • సిరిసిల్ల - కెకె మహేందర్ రెడ్డి
  • మేడ్చెల్ - లక్ష్మారెడ్డి
  • ఖైరతాబాద్ - శ్రవణ్ దాసోజు
  • జూబ్లిహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి
  • షాద్‌నగర్ - ప్రతాప్ రెడ్డి
  • భూపాల్‌పల్లి - గండ్ర వెంకట రమణా రెడ్డి
  • పాలేరు - కండల ఉపేందర్ రెడ్డి


మరింత సమాచారం తెలుసుకోండి: