తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వాడుకోవడానికి టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. అయితే పరిస్థితులను చూస్తుంటే ఎన్టీఆర్ రావడం చాలా కష్టంగా ఉంది. కూకట్‌పల్లిలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు విజయం సాధించారు. అయితే, ఆయన ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఫిరాయించిన సంగతి తెల్సిందే.ఈసారీ కూకట్‌పల్లిలో తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు బాగానే వున్నాయన్న ప్రచారం నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా కూకట్‌పల్లి సీటుని 'పంపకాల్లో' దక్కించుకుంది. అయితే, ఇక్కడి నుంచి పోటీ చేయాలని టీడీపీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయన ఆల్రెడీ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే, అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చిందిప్పుడు.

Image result for jr ntr

ఇటీవల రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. హరికృష్ణ కుమార్తెకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా, పార్టీలో 'నందమూరి కుటుంబానికి ప్రాధాన్యతనిస్తున్నాం' అనే సంకేతాల్ని పంపాలని చంద్రబాబు భావిస్తున్నారట. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని పోటీచేస్తే, నందమూరి కుటుంబం తరఫున కళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ కూడా ప్రచారంలో పాల్గొనేలా చేయవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తోంది.

Image result for chandrababu

అయితే, పెద్దిరెడ్డి మాత్రం తనకు పార్టీ అన్యాయం చేయదనీ, తానే కూకట్‌పల్లి నుంచి బరిలో వుంటానని ధీమాగా చెబుతున్నారు. పెద్దిరెడ్డి నమ్మకం నిజమవుతుందా.? చంద్రబాబు వ్యూహమే నెగ్గుతుందా.? వేచి చూడాల్సిందే. ఇదిలా వుంటే, నందమూరి బాలయ్య మద్దతుతో శేరిలింగంపల్లి టిక్కెట్ దక్కించుకున్న సినీ నిర్మాత భవ్య ఆనందప్రసాద్ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కోట్లు ఖర్చుచేసి టిక్కెట్ దక్కించుకున్నారంటూ ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలే విమర్శలు చేస్తుండడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: