మన లాయర్లు దేశంలో జరిగిన మహిళలపై అత్యాచార కేసుల విచారణ సమయంలో బాధిత మహిళలను ప్రశ్నించే విధానం వారు సిగ్గుతో కుంచించుకు పోయెలాగా ఉంటుంది. ఈ లాయర్ల ప్రవర్తన అత్యధిక కేసుల్లో నేఱగాళ్లను రక్షించే ప్రయత్నంగానే కనిపిస్తుంది. అయితే ఎంతో అభివృద్ది సాధించిన యూరప్ లోను ఇదే దుస్థితి నేలకొంది.  
సంబంధిత చిత్రం 
ఐర్లాండ్‌ దేశంలో సోషలిష్ట్ పార్టీ మ‌హిళా పార్లమెంట్ సభ్యురాలు రూత్‌ కాపింజ‌ర్‌, త‌మ దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. డబ్లిన్ పార్ల‌మెంట్‌ లో ఆమె మ‌హిళ‌లు వేసుకునే అండ‌ర్‌-వేర్‌ ను ప్ర‌ద‌ర్శిస్తూ, త‌న ఆగ్రహాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇటీవ‌ల కార్క్ అనే ప‌ట్ట‌ణం లో ఒక టీనేజ్ అమ్మాయి (17) అత్యాచారానికి గురైంది. ఆ కేసులో 27ఏళ్ల వ్య‌క్తిని నిర్ధోషిగా ప్ర‌క‌టించారు. 
Ireland women MP holds lacy underwear to highlight rape trial remarks
అయితే కోర్టులో ఆ కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో, లాయ‌ర్ మాట్లాడుతూ ఆ యువ‌తి ఎలాంటి అండ‌ర్‌-వేర్ వేసుకుందో తెలుసా? అని ప్ర‌శ్నించాడు. అలాంటి అసహ్యమైన ప్రశ్నను సంధించిన ఒక లాయర్ వ్యవహారంతో దేశ‌వ్యాప్తంగా న్యాయ‌వాదుల తీరుపై నిర‌స‌న వెల్లువైపారుతుంది. 
ireland parliament member Ruth కోసం చిత్ర ఫలితం
విచార‌ణ స‌మ‌యంలో ముఖ్యంగా మహిళలను ఎలాంటి ప్ర‌శ్న‌లు వేయాలో కూడా తెలియ‌దా? అని కొంద‌రు నిల‌దీస్తున్నారు. ఎప్పుడూ బాధితుల‌నే త‌ప్పుగా చిత్రీక‌రిస్తు న్నారంటూ ఎంపీ రూత్ కాపింజ‌ర్ ఆరోపించారు. బాధితుల‌ను వేధించ‌డం నిలిపేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్‌ లో ఎంపీ రూత్‌ కాపింజ‌ర్ మాట్లాడుతూ, బాధితురాలు వేసుకున్న అలాంటి అండ‌ర్‌-వేర్‌ నే ప్ర‌ద‌ర్శించారు. ఈ కేసుకు సంబంధించిన‌ తీర్పు కాపీ బ‌య‌ట‌కు వచ్చిన వెంటనే, న్యాయ‌వాదులు వేస్తున్న‌ ప్ర‌శ్న‌ల స‌ర‌ళిపై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వెల్లువెత్తింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: