Election commission and KCR కోసం చిత్ర ఫలితం
ఎన్నికల సమయం ఇది. మాట్లాడేమాట, సమయం, స్థలంపై అవగాహన ఉండాలి. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఉపయోగించిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే కేసీఆర్ "తూ నీ బతుకు చెడ" అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టింది. 
KCR unparliamentary comments on oposion members కోసం చిత్ర ఫలితం
"తూ నీ బతుకు చెడ" అన్న వ్యాఖ్యలు ఎందుకు చెయ్యవలసి వచ్చిందో? వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ జనరల్ సెక్రటరీకి ప్రధాన ఎన్నికల సంఘం (సిఈవో) నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 
EC questions KCR language కోసం చిత్ర ఫలితం
ఇటీవలే ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. బీ-ఫామ్ దరఖాస్తు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించ వద్దంటూ పలుమార్లు  సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచెయ్యాలని సూచించారు. అయితే తొలిసారిగా ఆయనకే ఎన్నికల సంఘం నోటీసులు జారీ చెయ్యడం గమనార్హం. 

EC questions KCR language కోసం చిత్ర ఫలితం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రులు కెటిఆర్, హరీష్ రావులపైన, టిఆర్ఎస్ నేతలపైన టిడిపి నేతలు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.అందులో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబుపై చేసిన విమర్శలను ప్రస్తావించారు. అవన్ని ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నాయనివారు పేర్కొన్నారు.


ఆ అంశాలు ఇలా ఉన్నాయి.


*చంద్రబాబు ఆంద్ర రాక్షసి..

*కెసిఆర్నేను మూడో కన్ను తెరిస్తే..నీ గతేంకాను నీతో పొత్తా ..ఛీఛీ..!

*తెలంగాణ ఆంద్రులకు చంద్రబాబు శని

*చంద్రబాబు పెద్ద కుట్రదారుడు..ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తున్నారు

*కూటమి అదికారంలోకి వస్తే మన జుట్టు చంద్రబాబు చేతికి

*చంద్రబాబు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు..

*బాబు కుట్రలు..నోట్ల కట్టలు...కాంగ్రెస్ ది బానిస బతకు..బాబు ముందు ఉత్తం చేతులు కట్టుకుని నిలబడ్డాడు..

*ఆంద్ర సొమ్ములు ఇక్కడకు తరలించారు. 

*₹500 కోట్లతో రాహుల్ తో చంద్రబాబు డీల్ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ నేతలపై చర్య తీసుకోవాలని తెలంగాణ టిడిపి నేతలు పిర్యాదు చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: