వైఎస్సార్ కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ట్రడిషనల్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటారు. ఆయన రాజకీయ పంధా చిత్రంగా ఉంటుంది. ఆయన అంతర్ముఖుడిగా కనిపిస్తారు. అందరితో ఉంటూనే లోపలి మనిషిని అలాగే ఉంచుతారు. ఆయన ఏది అనుకుంటే అదే ఫైనల్ అన్నది కూడా పార్టీ వర్గాల మాటగా ఉంటోంది. అందువల్ల వ్యూహలన్నీ ఆయన బుర్రలోనే ఉంటాయనుకోవాలి.


పెదవి విప్పని తీరు:


తనపైన హత్యాయత్నం జరిగితే ఎవరైన నోరు విప్పుతారు. ఇదేంటని అన్యాయాన్ని నిలదీస్తారు. ఇక్కడ జగన్ తీరు మాత్రం భిన్నంగా ఉంది. ఆయన ఇంతవరకూ పెదవి విప్పలేదు. ఏదీ చెప్పలేదు. పక్క నుంచే కధ అంతా నడిపిస్తున్నారు. అంటే  తల్లి విజయమ్మ, పార్టీ వారు చెబుతోందే జగన్ అభిప్రాయంగా తీసుకోవాలి. కానీ జగన్ నేరుగా చెబితే వచ్చే రియాక్షన్ వేరు. కానీ ఆయన మాట్లాడకుండానే ముందుకు సాగిపోతున్నారు.


మరో మూడు రోజులు :


ఇక జగన్ పాదయాత్ర పార్వతీపురం లో ప్రవేశించింది. ఇక్కడ కూడా ఆయన యధాప్రకారం మౌనంగానే నడచుకుంటూ ముందుకు సాగిపోయారు. ఈ రోజు ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు. రేపు కోర్టుకు హాజరై తిరిగి శనివారం పాదయాత్ర ప్రారంభిస్తున్స్తారు. శనివారం పార్వతీపురంలో భారీ బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాల భోగట్టా. అక్కడైన జగన్ పెదవి విప్పుతారా, లేక రొటీన్ గా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ముందుకు పోతారా అన్నది చూదాలి.


కోర్టు నిర్ణయం  తరువాతేనా:


జగన్ వ్యూహాత్మక మౌనం వెనక కారణాలు ఉన్నాయని అంటున్నారు. హై కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఇపుడు విచారణ జరుగుతోంది. బాబుకు నోటీసులు కూడా జారీ చేశారు. రెండు వారాల తరువాత సీఎం చంద్రబాబు, డీజీపీల వివరణలతో కూడిన నివేదిక కోర్టు ముందుకు వస్తుంది. దానిపై కోర్టు తీసుకునే నిర్ణయం తరువాతనే జగన్ మౌనం వీడుతారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే జగన్ మౌనమే ఇపుడు రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: