ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార చిహ్నం మారింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ కలర్‌, నీలం, నలుపు తెలుపు రంగుల్లో చిహ్నాన్ని ఖరారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించిన అధికారిక చిహ్నంలో పలు మార్పులు చేసి...అమరావతి శిల్ప కళ స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార చిహ్నంలో ఇప్పటి వరకు ‘పూర్ణ కుంభం’ ఉండేది.   దాదాపు ఐదున్నర దశాబ్దాల తరువాత ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం మారింది. సరికొత్త చిహ్నాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించింది.


ఇప్పటివరకూ చిహ్నంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న ఆంగ్ల పదాన్ని తెలుగులోను, మరోవైపు ఆంగ్లంలో, ఇంకో వైపు హిందీలోనూ రాశారు. దిగువన ఉండే 'సత్యమేవ జయతే' అన్న పదాన్ని తెలుగులోకి మార్చారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికార చిహ్నంలో ఇప్పటి వరకు ‘పూర్ణ కుంభం’ ఉండేది. అయితే, అది తప్పని ప్రభుత్వం తేల్చింది. ఎన్నో ఏళ్ళుగా అధికారులు, ప్రభుత్వాలు ఈ తప్పు చేస్తున్నాయని తెలుసుకుని, ఇప్పుడు సరిదిద్దారు. దీనిలో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క (ధర్మ చక్రం) ఉంటుంది.

ap 15112018 3

క్రీస్తు శకం ఒకటో శతాబ్దిలో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్న ఘటం (పూర్ణఘటం) చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘటం చుట్టూ ఉన్న మూడు వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై ఉన్న నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది.  ఇక ఈ చిహ్నాన్ని మూడు రకాలుగా ముద్రించుకునేలా తయారు చేసినట్టు ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: