చిన్నంశెట్టి రామ‌చంద్ర‌య్య‌. క‌డ‌ప జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయకుడు. తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకుని జ‌గ‌న్ కు జైకొట్టిన మాజీ మం త్రి కూడా! సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న‌ప్ప‌టికీ.. ఏ పార్టీలోనూ అంకిత భావం చూపించ‌లేక‌పోయార‌నే అప‌వాదును ఎదుర్కొన్నారు. రాజ కీయ రంగ ప్ర‌వేశం టీడీపీతోనే ప్రారంభ‌మైనా.. ఇప్ప‌టికి మూడు పార్టీలు మారారు. ఏ పార్టీలోనూ స్థిర మైన సుస్థిర‌మైన నేతగా ఎద‌గ‌లేక పోవ‌డం గ‌మ‌నా ర్హం. ఎక్క‌డిక‌క్క‌డ అసంతృప్తితోనే రామ‌చంద్ర‌య్య వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరు కూడా ఉండ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న వైసీపీకి ఏమేర‌కు ఉపయోగ‌ప‌డ‌తాడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌కు ఏలాంటి ప్ర‌యోజ‌నాలు అందిస్తాడ‌నే విష‌యం తెర‌మీదికి వ‌చ్చిం ది. విష‌యంలోకి వెళ్తే.. సీనియ‌ర్ నేత అయిన రామ‌చంద్ర‌య్య‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాడ‌ని కొంద‌రు నాయ‌కులు అంటున్నారు. 


లేదు.. ఆయ‌న కేవ‌లం మైకు పుచ్చుకుని మాటల‌కే ప‌రిమిత‌మ‌వుతార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఈ ప‌రిస్థితిలో రామచంద్ర‌య్య ఫ్యూచ‌ర్ ఏంటి?  వైసీపీలో ఆయ‌న ప్ర‌యోజనం ఏంటి? అనే అంశాల‌పై చ‌ర్చ సాగుతోంది. 1985లో టీడీపీ నుంచి పోటీ చేసి కడప ఎమ్మెల్యేగా గెలుపొందా రు. 1986లో ఎన్టీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1988లో ఎస్‌ఎఫ్‌సీ చైర్మన్‌గా పనిచేశారు. 1989లో రాజంపేట పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. 1991లో కడప పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత టీడీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1994లో సివిల్‌సప్లయ్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌ కమిటీలో కీలకమైన పదవులను పొందారు. 2004లో తిరిగి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 


2009లో టీడీపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావడంలో సీఆర్‌సీ కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శాసనమం డలిలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు అస‌లు సిస‌లు బాధ్య త‌లు సీఆర్‌పై ప‌డ్డాయి. ఎన్నిక‌ల ముందు.. కీల‌క‌మైన రాజ‌కీయాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో సీఆర్ వంటి వారు వైసీపీకి ఉప‌యోగ‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, ఈయ‌న ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తారు?  లేదా బొత్స‌, ధ‌ర్మాన వంటి కీల‌క నేత‌ల మాదిరిగా తెర‌చాటుగానే ఉండిపోతారా? అనేది భ‌విష్య‌త్తే తేల్చ‌నుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: