ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ లను అత్యంత దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.  ఈ ఘటన ఏపిలోనే కాదు తెలంగాణలో కూడా సంచలనం రేపింది. అప్పటి నుంచి ముఖ్య నాయకుల విషయంలో ఇంటిలీజెన్స్ వర్గాలు అప్రమత్తంగా ఉంటూ వస్తున్నాయి.  తాజాగా  అరకు ఎమ్మెల్యే కిడారి సోమను హత్య చేసినట్టుగానే, తెలంగాణ ఎమ్మెల్యే చందూలాల్ ను హత్య చేసేందుకు మావోయిస్టులు వేసిన ప్లాన్ భగ్నమైంది. 
Image result for కిడారి సోమను హత్య
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు ప్రచారాల్లో మునిగిపోయారు.  కాగా, చందూలాల్ కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చందూలాల్ ను చంపాలన్న ఉద్దేశంతో 30 మంది మావోయిస్టులు పొంచి వున్నారని తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం పసిగట్టి ఆయన్ను అప్రమత్తం చేసింది.
Image result for కిడారి సోమను హత్య
అంతే కాదు మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చారన్న ఆరోపణలపై ఇద్దరు స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పద్మాకర్ మండలంలో ఆయన్ను అటాక్ చేసే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నారన్న విషయం వీరి విచారణలో తెలిసింది. దాంతో చందూలాల్ ని అప్రమత్తం చేయడంతో ఆయన కటాపూర్ లో ప్రచారం నిర్వహించుకుని గిరిజన గ్రామాలకు వెళ్లకుండానే వెనుదిరిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: