ఆంధ్రప్రదేశ్ లో ముందస్తున్న ఎన్నికలకు అన్ని పార్టీలు అప్పుడే సిద్దమయ్యాయి. ఓ వైపు తాము చేసిన అభివృద్ది పనుల గురించి అధికార పార్టీ టీడీపీ ప్రచారం చేస్తుంటే..నాలుగేళ్లలో అధికారంలో ఉన్న టిడిపి ప్రజను దారుణంగా మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీ వైసీపీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ లు దుయ్యబట్టారు. తాజాగా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప‌దేప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  అయితే ప్రత్యక్షంగా ఆయన పేరు ప్రస్తావించకున్నా..పరోక్షంగా పవన్ పై పంచ్ లు వేశారు జేడి. తిత్లీ తుపాను సంభ‌వించిన 4 గంట‌ల వ్య‌వ‌ధిలోనే చంద్ర‌బాబు త‌న కేబినెట్ మొత్తాన్ని ప‌లాస‌కు తీసుకొచ్చారు. అక్క‌ణ్నుంచే ప‌రిపాల‌న న‌డిపించారు. 

Image result for titli cyclone srikakulam

తుపాను వ‌చ్చే ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోలేదు. నిరంతరం స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. తుపాను త‌ర్వాత కూడా దాదాపు 12 రోజులు శ్రీ‌కాకుళంలోనే ప‌నిచేసి ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దారు. రికార్డు స‌మ‌యంలో బాధితుల‌కు ప‌రిహారం కూడా అంద‌జేశారు.  మొదటి నుంచి ఏపిలో ప్రకృతి వైపరిత్యాలు వస్తున్నాయని ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారని..అలా ఎంతో మందిని అప్రమత్తం చేయడం వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదని అన్నారు.  మరోవైపు ప్రతిపక్షంపై కూడా విరుచుకు పడ్డారు. తిత్లీ తుఫాన్ వచ్చిన సమయంలో ఆయన  హైద‌రాబాద్ కి వెళ్లిపోయారని..తుపాను బాధితుల‌ను ప‌ట్టించుకోలేదని అన్నారు.   ప‌వ‌న్‌ తీరిగ్గా ఆరు రోజుల త‌ర్వాత తుపాను బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

Image result for titli cyclone srikakulam chandrababu

 ఆ త‌ర్వాత నుంచి టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ప్రారంభించారు. తాజాగా సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..తిత్లీ ప్ర‌భావిత ప్రాంతాల‌ను తాను సంద‌ర్శించాన‌ని.. అదొక భీక‌ర తుపాను అని తెలిపారు.  అలాంటి విపత్కర పరిస్థితిని అంత తక్కువ సమయంలో ఏపి ప్రభుత్వం చక్కదిద్దిందని..నష్టపోయిన వారికి భరోసా ఇచ్చిందని అన్నారు.  అంతే కాదు విపక్షాలు అంటున్నట్లు బాధితులను ఆదుకోవడం అంటే మాయాబజార్ లో సృష్టించినట్లు సృష్టించలేరుకదా..అని అన్నారు.  ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు ప్ర‌భుత్వం త‌గిన‌విధంగా స్పందించ‌లేద‌న‌డం భావ్యం కాద‌ని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: