హరికృష్ణ కుమార్తె తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అయిపోయారు. రేపే నామినేషన్ వేస్తున్నారని సమాచారం. బుధవారం రాత్రే సుహాసిని తన అంగీకారాన్ని తెలిపినట్లు సమాచారం. విశాఖపట్నంలో పర్యటనలో ఉన్న చంద్రబాబును కలవడానికి గురువారం ఉదయమే సుహాసిని ఆమె స్నేహితురాలు కలసి విశాఖ బయలు దేరారు. అక్కడ చంద్రబాబు నాయుడి ఆశీర్వాదం తీసుకుని రేపు హైదరాబాద్ లో కూకట్ పల్లి నియోజకవర్గానికి సుహాసిని నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 

ఎంటీఆర్ వార‌సురాలిగా అరంగేట్రం..! సుహాసిని గెలుస్తుందంటున్న శ్రేణులు..!!

వాస్తవానికి కూకట్ పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి హరికృష్ణ కుమారు నందమూరి కళ్యాణ్ రామ్ ని పోటీలోకి దింపాలని చంద్రబాబు నాయుడు భావించారు. అయితే తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న కళ్యాణ్ రామ్ తనకు రాజకీయాల పట్ల్ ఆసక్తి లేదని... తానింకా పది, పదిహేనేళ్లు సినీపరిశ్రమలోనే కొనసాగాలనుకుంటున్నట్లు చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. ఇదంతా జరిగి దాదాపు నెల రోజులు గడచి పోయింది. 

పెద్దిరెడ్డి ఔట్.. నందమూరి సుహాసిని ఇన్.?

అయితే ఇప్పుడున్న పరిస్ధితుల్లో హరికృష్ణ కుటుంబాన్ని పూర్తిగా టీడీపీకి దూరం చేసుకునే పరిస్ధితి లేదు. పైగా తెలంగాణ ప్రజలలో సైతం హరికృష్ణ పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్లు ఆయన మృతి సందర్భంగా వచ్చిన అశేష జనవాహిన్ని బట్టి అర్ధమయ్యింది. దీంతో ఎలాగైనా నందమూరి కుటుంబం నుంచి ఎవరినో ఒకరిని తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దింపాలని భావించిన చంద్రబాబు హరికృష్ణ కుమార్తె సుహసినిని పోటీ చెయ్యమని ఆహ్వానించారు. అయితే తొలుత ఈ ప్రతిపాదనను కూడా హరికృష్ణ కుటుంబంలో ఎవరూ అంగీకరించలేదు. ముఖ్యంగా హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీరామారావులిద్దరూ పోటీ చేయవద్దని సోదరికి సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: