రాజకీయాలు చాలా తమషాగా ఉంటాయి.  ఇందులోకి దూకితే  గెలుపు వలపు సోకుతుంది. అంతా ఓడే వారే, నేనే విజేతను అన్న ఆలోచనలూ పుట్టుకువస్తాయి. . ఓ విధంగా రాజకీయాలను దుర్యోధనున్ని మయసభలో పోల్చాలి. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. ఆ మజా, మత్తు అలా సాగుతూనే ఉంటుంది అప్పటివరకూ..బ్యాలెట్ బాక్స్ విప్పేవరకూ. 


జనాన్ని చూస్తే ఇంతేనా :


జనం సాధారణంగా ఏ మీటింగుకైనా వస్తారు. అదే సినీ హీరో కం పొలిటీషియన్ అయితే ఇంకా ఎక్కువగా వస్తారు. వారి వీధిలో, వూళ్ళో నాయకుడు వచ్చి నిలబడితే కాసేపు విందామనుకునే వారే ఎక్కువ. మరి అటువంటి వారిని చూసి ఓటేస్తారనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. నిజానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు చిరంజీవి సభలకు వచ్చిన జనం మరెవరికైనా వచ్చరా. కానీ బ్యాలెట్ బాక్సులు తీస్తే మాత్రం రిజల్ట్ తేడా కొట్టేసింది. జనసేనానికి ఈ విషయం తెలియనిది కాదు. కానీ జనాలను చూస్తే అదే రకం ధీమా వచ్చేస్తుంది. దాంతో ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఓ వైపు బాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే మరో వైపు జగన్ తోనూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు.


సాలిడ్ ఓటు బ్యాంకులు ఉన్నాయి :


భారతీయ రాజకీయాలో ఎపుడో మరీ దారుణమైన పరిస్థితులు ఉంటే తప్ప ప్రతీ రాజకీయ పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉంటుంది. ఆ ఓట్లు అటు ఇటుగా వాళ్ళకే పడతాయి. ప్రతి ఎన్నికలో తటస్థుల ఓట్లు పెరుగుతాయి. వాటిని ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటే వారే విజేత అవుతారు. అంటే  కచ్చితమైన ఓటు బ్యాంకులు కలిగిన బలమైన పార్టీల ముందు కొత్తగా వచ్చిన పార్టీ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే తనకంటూ కొంత ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి. అది ఒకటో, రెండో ఎన్నికలు జరిగితేనే తప్ప నిలకడగా నిలబడదు. 


పవన్ ఓటింగ్ ఎంతో తేల్చే ఎన్నికలు :


పవన్ విషయంలో కొత్తగా ఎన్నికల రాజకీయాల్లొకి  వస్తున్నారు. ఆయనకంటూ ఓటు బ్యాంక్ ముందు ఎంత ఉందో చూడాలి. మిగిలిన వారికి ఆల్రేడీ ఉన్న ఓటు బ్యాంకుతో పోటీ పడినపుడే తట‌స్థుల ఓట్లకు గేలం వేయడం జరుగుతుంది. అంతే తప్ప మొత్తం ఓట్లు ఎపుడూ గుత్తమొత్తంగా ఒకే పార్టీకి పడిపోవు. మరి ఈ రాజకీయ గణితం తెలుసో తెలియకో వచ్చిన జనం అంతా ఓట్లేస్తారనుకుంటే అది అతి ధీమాగానే మారుతుంది. సో జనసేనాని అన్నీ చూసుకుని జాగ్రత్తగా అడుగులు వేయడమే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: