ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని ఓ వైపు సర్వేలు చెబుతూంటే ఆయన గారి మంత్రివర్గంలోని ఓ మంత్రి గారి మెజారిటీ వచ్చే ఎన్నికల్లో రెట్టింపు అవుతుందని సర్వేలు ఘొషిస్తున్నాయి. ఈ సర్వే చేయించుకున్న మంత్రి గారు నేల మీద నిలవడం లేదు, ఏకంగా ఆకాశంలో తేలిపోతున్నారు. 70 వేల పై దాటి మెజారిటీ వస్తుందంటే బాబు కూడా మరో మారు ముఖ్యమంత్రి కావడం ఖాయమే కదా.


ఆర్నెల్ల క్రితం అదీ విషయం :


సరిగ్గా ఆరు నెలల క్రితం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఘోరంగా ఓడిపోతారని టీడీపీ అనుకూల మీడియా ఒకటి తేల్చింది. దాంతో మంత్రి గంటా అలగడం, ఆ రోజే విశాఖ వచ్చిన చంద్రబాబు ఆయనతో రాయబేరాలు నడిపి తనతో పాటు వేదిక మీద పక్కన కూర్చోబెట్టుకోవడం గుర్తుండే ఉంటుంది.  మంత్రి అసలు గెలవరు అన్న చోట ఇపుడు డబుల్ మెజారిటీ సాధించదం కేవలం ఆరు నెలల్లొ  జరిగిపోయింది. 


సర్వేల మీద సర్వేలు :


మంత్రి గంటా గత ఆరు నెలలుగా భీమిలీ మీద ద్రుష్టి ఉంచారనడం వాస్తవం. ఇదివరకులా కాకుండా ఆయన తరచూ తన నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో మంత్రి హైదరాబాద్ కి చెందిన పేరున్న సంస్థలతో సర్వేలు తరచూ చేయించారని భోగట్టా. అదే విధంగా మొత్తం నియోజకవర్గం కవర్ అయ్యేలా కూడా సర్వేలు అన్ని వర్గాలతో చేయించారని తెలిసింది. ఈ సర్వేల్లో మంత్రి మంచి వారు, అనుచరులే చెడ్డవారు అని కూడా వచ్చిందట. వచ్చే ఎన్నికల్లో గంటా గెలుపునకు ఢోకా లేదని, మెజారిటీ గత ఎన్నికల్లో నలభై వేలు వెస్తే ఈసారి అది రెట్టింపు అవుతుందని కూదా క్లారిటీగా చెప్పాయట.


500 కోట్లతో అభివ్రుధ్ధి పనులు :


ఈ విషయం తెలిసిన తరువాత మంత్రి గంటా జోరు మామూలుగా లేదు. టీడీపీలోనే మరో మారు మంత్రిగా జెండా ఎగురవేస్తానన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం  చేస్తున్నారు. ఇక భీమిలీలో 500 కోట్లతో అభివ్రుధ్ధి పనులు కూడా చేపడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఓ మంత్రి గారికే  మెజారిటీ డబులు అయితే ఏపీలో బాబు పార్టీకి సీట్లు కూడా రెట్టింపు కావాలి కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇది లాజిక్ పాయింటే మరి. భీమిలీలో సర్వే చేసిన  సర్వేశ్వరుల చూపు ఓసారి అమరావతి పైన  కూడా పడితే ఏపీలో టీడీపీ జాతకం మారుతుందేమోనని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: